అంబేడ్కర్ జాతర జయప్రదం చేయండి - పాలడుగు నాగార్జున
*ఏప్రిల్ 28న పూలే అంబేడ్కర్ జాతర నల్లగొండలో జయప్రదం చేయండి* - పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పిలుపు
మహాత్ముల జయంతుల సందర్భంగా ఏప్రిల్ 10 నుండి 14 వరకు నియోజకవర్గస్థాయిలో పూలే అంబేడ్కర్ సందేశ్ యాత్ర భారత రాజ్యాంగ రక్షణ యాత్ర పేరిట గ్రామాల్లో పర్యటనలు చేయనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం కోడి రెక్క మల్లయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మహనీయుల స్మరించుకుంటూ ఏప్రిల్ మాసమంతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్త ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న మనుధర్మ శాస్త్రాన్ని ఆధునిక భారత రాజ్యాంగం అని చెప్పడం దుర్మార్గమైన విషయమన్నారు. ప్రజలు ప్రజాతంత్ర వాదులు సామాజిక సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కర్తవ్యాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఏప్రిల్ 28న నల్లగొండ అంబేద్కర్ కల్చరల్ అడిటోరియంలో జరిగే పూలే అంబేడ్కర్ జాతరకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు.
ఈ సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్ జిల్లా సహాయ కార్యదర్శులు గాదె నరసింహ బొట్టు శివకుమార్ బొల్లు రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు పాపారావు చిలుముల రామస్వామి దండు రవి అంజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment