నాణ్యత పరీక్షలు లేకుండా గోడౌన్లకు దిగుమతి అవుతున్న బియ్యం పై విచారణ చేపట్టాలి - హైకోర్టు న్యాయవాది సోమవరపు డిమాండ్

 


 నాణ్యత పరీక్షలు లేకుండా గోడౌన్లకు దిగుమతి అవుతున్న బియ్యం పై విచారణ చేపట్టాలి - హైకోర్టు న్యాయవాది సోమవరపు డిమాండ్


 నాణ్యతను ధృవీకరించకుండ మరియు పరీక్షలు నిర్వహించకుండ  రైస్ గోడౌన్లకు దిగుమతి చేస్తున్న సిఎంఆర్ బియ్యంపై విజిలెన్స్ అధికారులతో విచారణ  జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది సోమవరపు సత్యనారాయణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

 ఈరోజు సూర్యాపేటకు చెందిన కొందరు మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై సేకరించిన రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బాదలాపురం గోడౌన్ కు దిగుమతి చేస్తున్నట్లు తెలిసిందని దాదాపు 115 ఏ సి కె ల బియ్యాన్ని గోడౌన్ లో దింపినట్లు దాదాపు మరో 60 లారీలు దింపడానికి వెయిటింగ్ చేస్తున్నాయని ఈ విషయంపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, నాణ్యతా పరీక్షలు చేయకుండా బియ్యాన్ని డెలివరీ తీసుకుంటున్న అధికారుల పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గత సంవత్సరం కూడా సూర్యాపేట మిల్లర్లు నల్లగొండ దగ్గర ఉన్న దుప్పలపల్లి గోడౌన్ కు ప్రజలు వినియోగించుకోలేని పురుగుల పట్టిన బియ్యాన్ని డెలివరీ చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

భారత ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో నూరు శాతం ప్రభుత్వ మూలధనం ఉన్న సివిల్ సప్లై కార్పొరేషన్ ధాన్యం సేకరణ చేస్తుంది. రైతుల దగ్గర నుండి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. ధాన్యం అందించిన నాటినుండి 15 రోజులలో మర ఆడించి బియ్యాన్ని కార్పొరేషన్ పేర్కొన్న గోడౌన్లకు మిల్లర్లు అప్పగించాలి, కానీ ఈ నిబంధన అమలు అవడం లేదని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో మిల్లర్లు ధాన్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకొని వివిధ వ్యాపారాలు చేస్తూ లాభాలు గడిస్తూ ప్రభుత్వానికి కార్పొరేషన్ కు నష్టాన్ని కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కార్పొరేషన్ ప్రభుత్వ జమానతుతో వివిధ సంస్థల నుండి వేలకోట్ల రూపాయలు ఏడున్నర శాతం నుండి 8 శాతం వడ్డీకి అప్పు తెచ్చి రైతుల నుండి ధాన్యం సేకరిస్తుందని, అధికారులు నిర్లక్ష్యం మరియు మిల్లర్లతో కొమ్మకు కావడంతో కార్పొరేషన్ కు దాదాపు 30 వేల కోట్ల రూపాయల బియ్యం రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 

అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, నాణ్యతను ధృవీకరించకుండ మరియు పరీక్షలు నిర్వహించకుండ బియ్యాన్ని సేకరిస్తున్న అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు పత్రములు పంపినట్లు ఆయన తెలిపారు. 

ఈ తతంగానికి కొందరు అసోసియేషన్ పెద్దలు శ్రీకారం చుట్టినట్లు, భారీగానే ఏ సి కె కి ఇంత అని ముడుపులు వసూలు చేసి పంపిణీ చేసినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. పేద ప్రజలకు అందించే ఈ బియ్యాన్ని నాణ్యత పరీక్షలు చేయకుండా, పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్