*వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం : ఎస్పీ అపూర్వ రావు*


 *వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం : ఎస్పీ అపూర్వ రావు*

- - జగిని దంత వైద్య శాల, జగిని టెక్స్ టైల్స్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు చలి వేంద్రం ఏర్పాటు

- - సమాజ సేవలో నిరంతరం ముందున్న జగిని సంస్థలు


నల్లగొండ : వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం జగిని వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జిల్లా ఎస్పీ అపూర్వా రావు.


జగిని టెక్స్ టైల్స్, జగిని డెంటల్ కేర్ సంస్థల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించి ఆమె మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమాలలో జగిని సంస్థల అధినేత జగిని వెంకన్న నిరంతరం ముందుండడం అభినందనీయమన్నారు. వేసవిలో చలివేంద్రాల ఏర్పాటుతో పాటు బారికేడ్లు ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతూ పట్టణ ప్రజల మన్ననలు అందుకుంటున్నారని అభినందించారు. వేసవి కాలంలో రోడ్లపై వెళ్లే పాదచారులు, వాహనదారులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాబోయే రోజులలో ఎండలు మరింత పెరిగే పరిస్థితి ఉన్న క్రమంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చూసుకోవాలని సూచించారు. జగిని సంస్థల సేవలు మరింత విస్తగరించాలన్నారు. జగిని సంస్థల లాంటి వారిని స్పూర్తిగా తీసుకొని మరిన్ని స్వచ్చంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో జగిని సంస్థల అధినేత జగిని వెంకన్న, Dsp. నర్సింహ రెడ్డి, Ci అది రెడ్డి, ci గోపి, ట్రాఫిక్ ci శ్రీనివాస్, si రాజశేఖర్ రెడ్డి, జగిని సిబ్బంది..తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్