నారాయణపేట జిల్లా కలెక్టర్ పై DOPT కి VHP ఫిర్యాదు


 

నారాయణపేట జిల్లా కలెక్టర్ పై DOPT కి VHP ఫిర్యాదు


నారాయణపేట జిల్లా కలెక్టర్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి జితేంద్ర సింగ్ కు విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీని పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా స్పందించకపోయిన విషయాన్ని కూడా ఆ ఫిర్యాదు లో ప్రస్తావించినట్లు తెలిపారు. జాతీయ జెండాను అవమానపరిచిన ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ నాయకులపై నారాయణపేట జిల్లా కలెక్టర్ దురుసుగా ప్రవర్తించి, అమర్యాదగా మాట్లాడిన తీరును తప్పుపడుతూ డి ఓ పి టి కి ఫిర్యాదు చేశారు. గత జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజ చేసే విషయంలో మరియు జాతీయ జెండా ఆవిష్కరణ చేసే విషయంలో అంగన్వాడీ టీచర్ ఎస్తేర్ ప్రవర్తన భారత జాతి వ్యతిరేకతకు నిదర్శనంగా ఉన్నదని, ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్దామని జనవరి 27వ తేదీన విశ్వహిందూ పరిషత్ నేతలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని దీంతో కలెక్టర్ స్థాయిని మరిచి దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారనీ, హుందాతనం కోల్పోయి వ్యవహరించారని ఇదే విషయాన్ని చెబుదామని జనవరి 28వ తేదీ నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ కోరడం జరిగిందని వారి పర్సనల్ మొబైల్ కు, మరియు ఆఫీస్ సిబ్బందికి చాలాసార్లు విన్నవించినా రెస్పాండ్ కాలేదనీ, మేడం బిజీ ఉన్నారు.. మేడం బిజీ ఉన్నారు.." అని ఒకే సమాధానం లభించిందని దాదాపు నాలుగు నెలల నుంచి ఈరోజు వరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ నుంచి రెస్పాండ్ రావడం లేదని అయినప్పటికీ ఫిబ్రవరి 27వ తేదీన తెలంగాణ చీఫ్ సెక్రటరీ కి నారాయణపేట కలెక్టర్ గురించి ఫిర్యాదును మెయిల్ ద్వారా పంపామని. అయినప్పటికీ కలెక్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, విశ్వహిందూ పరిషత్ కు కనీస స్పందన తెలియజేయలేదని దీంతో కలెక్టర్ వ్యవహరించిన తీరు తో పాటు, విశ్వహిందూ పరిషత్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అపాయింట్మెంట్ ఇవ్వని చీఫ్ సెక్రటరీ విషయమై ఇచ్చిన ఫిర్యాదులో పేర్కన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం ఏమాత్రం తగదని. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం కూడానని అధికారులు, పాలకులు ప్రజల కోసమే పని చేయాల్సి ఉందని కానీ ఉద్యోగ ధర్మం విస్మరించడం ఏమాత్రం తగదని స్థాయికి తగ్గట్టు వ్యవహరిస్తేనే అధికారులపై ప్రజలకు భరోసా, గౌరవం కలుగుతుందని కలెక్టర్ పై ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి, ప్రచార ప్రముఖ్ శ్రీ సురేందర్ రెడ్డి గారు, శ్రీ పండరీనాథ్ గారు, పగుడాకుల బాలస్వామి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అధికారి ఏ స్థాయిలో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి తప్ప.. రాజ్యాంగాన్ని అతిక్రమించడం సరికాదు అని వారు హితవు పలికారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్