వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే :TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు
వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే :TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు
వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ జర్నలిస్టులే అని కోరుకున్న తెలంగాణ కోసం మరోమారు ఉద్యమం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు.
నాగారం ప్రెస్ క్లబ్ లో వివిధ పత్రికల్లో ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు టీజేయులో జాయిన్ అయిన సందర్భంగా హాజరయ్యారు. తోలి, మలి తెలంగాణ ఉద్యమాలు జర్నలిస్టుల వల్లే ఉవ్వెత్తున ఎగిసాయని అలాంటి జర్నలిస్టులను మోసం చేసిన కేసీఆర్ ఉద్యమకారులను ప్రజలను మోసం చేయడం ఆయనకు లెక్క కాదన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొంటేనే జర్నలిస్టులకు వచ్చే హక్కులు వస్తాయని జర్నలిస్టులకు రాజకీయ కోణం ఉండాలన్నారు. జర్నలిస్టుల బాగుకోరే ప్రభుత్వం ఏర్పాడాలని అలాంటి ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాలని అన్నారు. 9 సంవత్సరాలుగా ఇవిగో ప్లాట్లు అవిగో ప్లాట్లు అంటూ కెసిఆర్ జర్నలిస్టులను ఆట పట్టిస్తున్నాడని అది ఇంకా కొంతమంది జర్నలిస్టులకు అర్థం కావడం లేదన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇంటి స్థలాలు . హెల్త్ కార్డులు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య జర్నలిస్టులకు అందించాలని ఈ డిమాండ్లను పరిష్కరించే ప్రభుత్వమే రాబోయే రోజుల్లో తెలంగాణలో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర కార్యదర్శి కనకారెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వల్లపు శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ మెదక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజేందర్ రాష్ట్ర నాయకులూ సిద్దాల రవి వి. హరి బాబు , రామకృష్ణ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ , ఉపాధ్యక్షలు మహేష్ గౌడ్ నాగారం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment