మీడియాను అగౌరవ పర్చడం సరైంది* *కాదు* *-ఐజేయూ, టీయుడబ్ల్యుజె*

 



*మీడియాను అగౌరవ పర్చడం సరైంది* *కాదు*

*-ఐజేయూ, టీయుడబ్ల్యుజె*


నూతన సచివాలయం రాష్ట్రానికి తలమానికంగా ఉండడం శుభ పరిణామమని, మీడియాను అగౌరవ పరిచే ప్రభుత్వ వైఖరి మాత్రం సరైంది కాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సచివాలయమంటే అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, చట్ట సభల్లోనే మీడియాకు గ్యాలరీ ఉంటుందని, పరిపాలన కేంద్రంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు సముచిత స్థానం లేకపోవడం విచారకరమన్నారు. పరిపాలనకు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలకు, ప్రజలు తెలుసుకునే హక్కును కాపాడటానికి సచివాలయం తోడ్పడాలనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు సూచించారు. సమాచార సేకరణ కోసం జర్నలిస్టులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మంచి మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసిందని వారు గుర్తుచేశారు. 

సచివాలయ ప్రారంభోత్సవ కవరేజీకి

కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇతర రాష్ట్రాల మీడియాను ఆహ్వానించిన ప్రభుత్వం, తెలుగు మీడియాను అవమానించడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వారు కోరారు. అక్రెడిషన్ కార్డులు కేవలం బస్సుల్లో, రైళ్లలో రాయితీల కోసం మాత్రమే జారీ చేసినవి కావని, జర్నలిస్టుగా గుర్తింపు, ప్రభుత్వ రంగంలో స్వేచ్ఛగా సమాచార సేకరణకు అవి జారీచేయబడిన అసలు ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

ఇంత ఘనంగా ప్రారంభించిన కార్యక్రమంలో రాష్ట్ర పాత్రికేయులను అవమానించే వైఖరిని అనుసరించడం సరైంది కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో స్పందించాలని వారు కోరారు.

నూతనంగా ఏర్పాటైన సచివాలయంలో సమాచార సేకరణకు అవసరమైన సౌకర్యాలతో మీడియా పాయింట్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు సూచించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్