జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - టిజేయు



జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - టిజేయు 


*ఆర్డీవోను కలిసిన టీ జే యు జర్నలిస్టులు..*


జర్నలిస్టులకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి - టిజేయు

అక్రిడేషన్ రాని వారికి కార్డులు త్వరగా అందజేయాలి- టిజేయు


కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి తో కామారెడ్డి జర్నలిస్టులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బాబురావు ఆర్డీవో శ్రీనివాస్ తో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జర్నలిస్టు ఇళ్ల పట్టా స్థలాలను వెంటనే మంజూరు చేయాలని. మరియు అలాగే నూతనంగా నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జర్నలిస్టులకు సమావేశం కొరకు గదిని ఏర్పాటు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి ని కోరారు. అనంతరం ఆర్డిఓ స్పందించి నేను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడ్. అధ్యక్షులు వడ్ల రాజేందర్. జిల్లా కార్యదర్శి గోపాల్. ఉపాధ్యక్షులు ప్రసాద్. శ్రీనివాస్. మెడికల్ రాజు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీకాంత్.రాజు సీనియర్ జర్నలిస్టులు సత్యం శ్రీనివాస్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్