*దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి* *కేవిపిఎస్ జిల్లా కమిటి డిమాండ్*


 



*ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం* 

*దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి*

*కేవిపిఎస్ జిల్లా కమిటి డిమాండ్*


తుంగతుర్తి నియోజకవర్గంలో దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్ పై ఎమ్మెల్యే గాదరి కిశోర్ అనుచరులు భౌతిక దాడికి పాల్పడడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం కేవిపిఎస్ జిల్లాకార్యదర్శి పాలడుగు నాగార్జున ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దళిత బందులో అవినీతి జరిగిన దానిని స్వయాన ముఖ్యమంత్రి గారి అంగీకరించారని అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన చేతిలో ఉందని ప్రకటించారని అదే విషయాన్ని ప్రస్తావించిన దళిత న్యాయవాధీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం శోచనీయం అన్నారు. దళితబంధు రాజకీయలకతీతంగా అర్హులైన దళితులందరికి ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్ ప్రకారం అందరికి ఇవ్వాలన్నారు. 

ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి దళితులపై పరుష పదజాలం వాడడం సమర్థనీయం కాదన్నారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాధీకి మెరుగైన వైద్యం అందించాలని దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తుంగతుర్తి నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడం సరికాదన్నారు. ప్రశ్నిస్తున్న నాయకుల మీద, జర్నలిస్టుల మీద, మేధావుల మీద దాడులు శోచనీయమని చెప్పారు ఇలాంటి ఘటనలు వ్యాఖ్యలు పునరావృతం కాకుడదని కేవిపిఎస్ తెలిపింది...




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్