చిన్న పత్రికల గ్రేడింగుల లో ప్రింటింగ్ ప్రెస్ నిబంధన తొలగించాలి - చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు


 చిన్న పత్రికల గ్రేడింగుల లో ప్రింటింగ్ ప్రెస్ నిబంధన తొలగించాలి   -  చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు                                  

 హైదరాబాద్ మే 26... చిన్న మధ్య తరహా దినపత్రికల గ్రేడింగ్ విషయంలో కొంతమంది స్వార్థంతో ఆలోచిస్తూ చిన్న పత్రికలకు గ్రేడింగ్ విషయం సందర్భంగా ప్రింటింగ్ ప్రెస్ ప్రస్తావన తెస్తూ తమకు అనుకూలంగా నిబంధనలు పెట్టిస్తూ దొడ్డిదారిలో లబ్ధి పొందుతున్నారని చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన అర్హతలు ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారన్నారు వాస్తవ పరిస్థితులను గతంలోని నిబంధనలను పరిశీలించి అందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు నూతన జీవో వచ్చేలా చర్యలు తీసుకుని ఎం ప్యానెల్మెంట్ గ్రేడింగ్ విషయంలో అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు ప్రింటింగ్ ప్రెస్ లు ఎవరికీ లేవు ఉన్నవారు ఇతరుల పేపర్లతోపాటు తమ పేపర్లు ప్రింట్ చేస్తున్నారు అసలు ఏ బి సి డి గ్రేడ్లకు ప్రెస్ నిబంధనలకు అర్థం లేదు ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తే అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏ బి గ్రేడ్లకు పైన ఉన్న పెద్ద పత్రికలకు మీడియం పత్రికలకు అలాగే ఏబి గ్రేడ్లకు కింద ఉన్న సి డి గ్రేడ్లకు ప్రింటింగ్ ప్రెస్ లు అవసరం లేదు కానీ ఏ బి గ్రేడ్లకు ప్రింటింగ్ ప్రెస్ అవసరం అనే నిబంధన కొంతమంది స్వార్థపరులు పెట్టిన ప్రతిపాదన కావున అన్ని విషయాలు పరిశీలించి అర్హులైన అందరికీ న్యాయం చేసే విధంగా నూతన జీవో వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేదా పాత జీవో ప్రకారం గ్రేడింగు ఎం ప్యానెల్మెంట్  చేయాలనుకుంటే ప్రింటింగ్ ప్రెస్ నిబంధనలను తొలగించి అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్