*సీఎం కు ప్రసాదం అందించిన ఎమ్మెల్యే బిగాల *
*సీఎం కు ప్రసాదం అందించిన ఎమ్మెల్యే బిగాల *
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కలిశారు. సోమవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే గతవారం మూడు రోజులపాటు వైభవంగా జరిగిన ఆలయ స్థాపన మహోత్సవంలో పూజలు అందుకున్న ప్రసాదాన్ని అందించారు. తన స్వగ్రామం మాక్లూర్ లో నిర్మించిన దేవాలయాల విశిష్టతను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. తన తండ్రి కృష్ణమూర్తి గారి సంకల్పాన్ని బిగాల సోదరులు ఏ విధంగా పూర్తి చేశారన్న అంశాన్ని సీఎంకు చెప్పారు. ఓకే ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప సహిత,శ్రీ ఆంజనేయ శివ పంచాయతన సహిత, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయాలను నిర్మించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సోదరులు చేసిన కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Post a Comment