నూతన పార్లమెంట్ భవనానం
నూతన పార్లమెంట్ భవనానం*
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నూతన పార్లమెంట్ భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. నూతన పార్లమెంట్ భవనం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పార్లమెంట్ భవనంపై మీ ఆలోచనలను సొంత వాయిస్ ఓవర్తో వీడియోను 'మై పార్లమెంట్ మై ప్రైడ్' హ్యాష్ట్యాగ్తో షేర్ చేయాలని కోరారు. అందులో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానని.. వీడియోను మర్చిపోవద్దంటూ చెప్పారు.
అత్యాధునిక సదుపాయలతో దాదాపు 15 ఏకరాల్లో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఉభయసభల్లో ఉంచిన అశోక్ చక్రం ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ పక్షి నెమలి ఆధారంగా చేసుకొని కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను డిజైన్ చేశారు. రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పువ్వు కమలం ఆధారంగా రూపొందించారు. 2020లో పార్లమెంట్కు శంకుస్థాపన చేయగా.. మే 28న జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Comments
Post a Comment