చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలి : వాసవీ పొలిటికల్ ఫోరం ఛైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె


 చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలి : 

వాసవీ పొలిటికల్ ఫోరం ఛైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె 


హైదరాబాద్ : చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలని వాసవీ పొలిటికల్ ఫోరం చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరినాథ్ గుప్త మాట్లాడుతూ, సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లవేళలా ముందు వరుసలో నిలిచే వైశ్యుల్లో రాజకీయ చైతన్యం పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు.

ఏ మాత్రం స్వార్థం లేకుండా సమాజ సేవకు తమ స్వార్జితాన్ని వినియోగించే వైశ్యులు అధికారంలో ఉంటే, బహుళ జనులంతా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. గతంలో చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం ఐదు నుండి 10 వరకు ఉండేదన్నారు. క్రమేణా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వైశ్యులకు కనీసం 10 టికెట్లు ఇవ్వాలని ఆయన అన్ని పార్టీలను డిమాండ్ చేశారు. కాగా లోకానికి శాంతి సందేశం ఇచ్చిన వాసవీ మాత త్యాగనిరతిని విశ్వవ్యాప్తం చేయాలని హరినాథ్ గుప్త పిలుపునిచ్చారు.

 ఇదిలా ఉండగా వినోబా నగర్ సైనిక్ పురి లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైయున్న వాసవీ మాత కు కిలో వెండి కిరీటాన్ని దేమ వీరేశం గుప్త బహూకరించారు. పుష్పాలంకరణ మాదంశెట్టి అశోక్ కుమార్ చేయించగా,ఈ కార్యక్రమంలో శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు పోకల శ్రీనివాసులు గుప్త, తాటిపల్లి శ్రీనివాస్ గుప్త, చీకోటి లక్ష్మీపతి, ఆలయ వైస్ చైర్మన్ గుబ్బ మహేష్, అధ్యక్షులు కాసం వెంకట హరి, ఇమ్మడి లక్ష్మీనారాయణ, గుబ్బ రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

 వినాయక్ నగర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, మైలవరపు శ్రీనివాస్ , నంగునూరి సత్యనారాయణ, మద్ది శ్రీనివాస్, విజయ్ కుమార్, నవీన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్