సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ- బురుగడ్డ పుష్ప నగేష్
సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ-
బురుగడ్డ పుష్ప నగేష్
సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలు కురుమ లు నిర్వహించే బీరప్ప పండుగ అని పటాన్చెరు మాజీ కార్పొరేటర్ ఉమ్మడి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ పుష్ప నగేష్ అన్నారు.జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి లో జరుగుతున్న బీరప్ప చౌడలమ్మ జాతరకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. కురుమల ఆరాధ్య దేవం బీరప్ప కామరతి కళ్యాణోత్సవం యాదవుల ఆరాధ్య దైవం చౌడలమ్మ కళ్యాణ్ ఉత్సవం అంగరంగ వైభరంగ వైభవంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రంలో ఉండే ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు పంటలు సమృద్ధిగా పండి సంతోషంగా ఉండాలని కులదైవాన్ని కోరుకున్నానని అన్నారు. కురుమల్లో రాజకీయంగా అత్యంత వెనుక పడ్డారని ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య పరంగా కురుమలు ముందుండాలని గ్రామాల్లో అన్నదమ్ముల కలిసిపోయే తత్వం కురుమ కులానికి ఉన్న గొప్ప వరం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో కురుమలు బీరప్ప సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ సత్యం న్యాయం ధర్మం వైపు ఉండి నియమ నిష్టలతో వారం రోజులపాటు అంగరంగ వైభవంగా బీరప్ప పండుగను చేసుకుంటామన్నారు. అనంతరం కొండ పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోరే ఎల్లయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమల్లయ్య జిల్లా ఉపాధ్యక్షులు పుల్ల బిరయ్య కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భింగి స్వామి ఎంపీటీసీ దర్గయ్య లకుడారం సర్పంచ్ కడారి ఐలయ్య బొగర్ల బీరప్ప చాట్లపల్లి కుల పెద్దలు యువజన అధ్యక్షులు ప్రభాకర్ కంతుల రాములు జిల్లా ఉద్యోగుల సంగం గౌరవ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు రవి గజ్వేల్ మండల అధ్యక్షులు నాగయ్య కొండపాక మండల అధ్యక్షులు రమేష్ సిద్ది పేట అద్యక్షలు శ్రీకాంత్ కంతులు రమేశ్ జిల్లా నాయకులు బక్కొల్ల యాదగిరి, సంఘం నర్సింలు, తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment