1200 మంది బలిదానం చేసుకొని సాధించిన తెలంగాణ కెసిఆర్ కుటుంబం పాలయ్యింది - మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డి


 

1200 మంది బలిదానం చేసుకొని సాధించిన తెలంగాణ కెసిఆర్ కుటుంబం పాలయ్యింది - మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డి

1200 మంది బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే కెసిఆర్ కుటుంబం పాలయ్యిందని మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డిలు అన్నారు.


10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత


ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది


ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులు మంత్రులు చేశారు


వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే


తప్పు చేశాను క్షమించండి ప్రజాయుద్ధం ఒక గద్దర్ ప్రజలను క్షమాపణ కోరిన గద్దర్ 


తుపాకీతో చేయలేనిది ఓటుతో చేయొచ్చు


టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గిన్నిస్ బుక్ లో ఎక్కించొచ్చు


జర్నలిస్టులు టిఆర్ఎస్ పార్టీకి భజన పరులుగా మారోద్దు


తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పర ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన దగా పడ్డది ఎవరు ?దండుకున్నది ఎవరు?

రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజాయుద్ధన నౌక గద్దర్ ఓయూ ఉద్యమకారులు గాదెన్నయ్య జేఏసీ పిడమర్తి రవి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాజీ టీఎస్పీఎస్ సభ్యులు బిజెపి అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి సిహెచ్ విటల్ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి విట్టల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.


కెసిఆర్ ది పార్టీ కాదని ఒకరితోటే నడుస్తున్న రాజ్యాధిక పాలన అని 16వేల కోట్లరూపాయలకు ఒక్క ఎస్ఎఫ్ఐటి సచివాలయం కట్టెందుకు ఖర్చు పెట్టారని ఎన్ని హంగులతో నిర్మించిన ఎనిమిది వేలు మించదన్నారు. మిగిలిందంతా అవినీతి సమ్మేనని ఉన్నవి కులగొట్టు ఎలక్షన్లో ఖర్చుపెట్టు సీఎం కూర్చిపట్టు అనే నినాదంతో కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఐక్యం కానన్ని రోజులు తెలంగాణ ప్రజలను కేసీఆర్ పార్టీ పీడుస్తూనే ఉంటాడని పీడ విరగడ కావాలంటే కెసిఆర్ ను గడ్డి దించడం ఒకటే మార్గమని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు.


తెలంగాణలో మాదిగలు మాయమైపోతున్నారని, మాదిలకు మంత్రి,ఎమ్మెల్యే, ఎమ్మెల్సి మాదిగలకు అసెంబ్లీలో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన దండుకున్నది ఎవరు..? దగా పడ్డది ఎవరు...? అని చర్చపై జెఏసీ నాయకులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజం ఉద్యమ కాలంలో కీలకపాత్ర పోషించిందని, తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ తెలంగాణ రాలేదని సంపూర్ణ తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తాను సంపూర్ణ తెలంగాణ కోసం పనిచేశానని తనకు కెసిఆర్ టికెట్ ఇస్తే కేసీఆర్ డబ్బులు ఇచ్చి ఓడకొట్టించందన్నారు. తెలంగాణ లో ఇదే పాలసీ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ నేత అయోధ్య రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులకు నాందిపలికేల ఉండాలని కోరుకున్నానని ప్రస్తుతం తెలంగాణలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రజానీకం అన్యాలను గుర్తించాలన్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై పోరాడే వారిని చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయం కోసం కేటీఆర్ నటిస్తూ రాష్టం ను అప్పుల పాలు చేస్తున్నారన్నారు. 1200 మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంను ఆగం చేస్తూ కెసిఆర్ ప్రజలను దోచుకుంటున్న దొంగ అన్నారు. తెలంగాణ సమాజం తిరగబడే పరిస్థితి రావాలన్నారు. కష్టపడింది ఒకరైతే ఆస్తులు కల్వకుంట్ల కుటుంబం వెనుక వేసుకుంటుంది అన్నారు. బీ ఎస్పీ ప్రతినిధి సాంబశివురావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించార న్నారు. నీలో నిధులు నియామకాల పేరు తో ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నాదన్నారు. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతుందన్నారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి అద్వానంగా మారిందన్నారు. పాఠశాలలో పందులు స్వైర వివాహం చేస్తుంటే పట్టించుకునే నాధులు లేకుండా పోయారన్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో రైతుల నుండి భూములను 12 లక్షలకు తీసుకుని నాలుకోట్లకు వెల్ఫేర్ కంపెనీకి అమ్ముకున్నారన్నారు. అనంతరం టి జె యు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ గారు మాట్లాడుతు నిజాంసాగర్ సర్కార్ వదిలిన భూములకు ఇనం పేరుతో డ్రామా లేపి కల్వకుంట్ల ఫ్యామిలీకి కెసిఆర్ కేటీఆర్లు దోచిపెడుతున్నారన్నారు. ఆంధ్రకు కాంట్రాక్టర్లు పోతున్నాయని తెలంగాణ తెచ్చుకుని ఇందుకేనా అని,,, గ్రామాల్లో సర్పంచ్లను సైతం ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన జర్నలిస్టులే అని, జర్నలిస్టులకు వెంట్రుకంత అంతమాత్రం కెసిఆర్ ఏం చేయలేరన్నరు. వందల మంది జర్నలిస్టులు కరుణ సమయంలో చనిపోతే ఈ ప్రభుత్వం ఆదుకోలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ రాష్ట్ర కార్యదర్శి దశరథ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాబురావు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వేముల సుదర్శన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు భువనగిరి యాదాద్రి జిల్లా అధ్యక్షులు శానుర్ బాబా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు మహేష్ గౌడ్ శిద్దాల రవి గండ్ర నరేందర్ పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్