ఈనెల 26న బండి సంజయ్ కుమార్ నల్గొండకు రాక


 

ఈనెల 26న బండి సంజయ్ కుమార్ నల్గొండకు రాక


 *ఈనెల 26న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నల్గొండకు రాక -*

*బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్*

 *నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నందు బహిరంగ సభ*


*ఈరోజు బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో మే 30 నుండి జూన్ 30 వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమంలో భాగంగా తేదీ అనగా 26-06-2023 సోమవారం నాడు సాయంత్రం 05:00 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ నందు సుమారు పదివేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. 

ఈ సభకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విచ్చేయుచున్నారని, ఈ సభకు బిజెపి రాష్ట్ర, జిల్లా ,మండల, పట్టణ, వివిధ మోర్చాల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, యువకులు, విద్యార్థులు, మేధావులు, కవులు, మహిళలు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిజెపి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జాతీయ నాయకులు గోలిమసూదన్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గలు సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ ,  నాగం వర్శిత్ రెడ్డి, కనుమంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ కన్వీనర్ బండార్ ప్రసాద్ , ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య, పట్టణ అధ్యక్షులు మొరిశేట్టి నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరెడ్డి, పుల్కరం బిక్షం, గుండ వినయ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి భోగారి అనిల్ కుమార్, వేమిరెడ్డి బిక్షం రెడ్డి,వంగూరి రాఖి, నాగం వర్షిత్ రెడ్డి, రేగట్ట రుక్నా గౌడ్, ఆవుల మధు, ఏరుకొండ హరి కొత్తపల్లి వెంకట్ , ఉట్కూరి బాలాజీ, సముద్రల వెంకట్, తదితర నాయకులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్