నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం


 నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం

ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి 

మాంసం ముద్దులైన మృతదేహాలు 

నల్లగొండ:

నల్లగొండలో ని బర్కత్ పురా కాలనీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజి లో ఏసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలై చనిపోయారు. ఈ సంఘటనలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు. పేలుడు జరిగిన సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుండి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్