ఘనంగా పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు


  ఘనంగా పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు





నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు  జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. చిట్యాల మున్సిపాలిటీలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో పల్లపు బుద్ధుడు గారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ అర్చకులు పూలదండతో శాలువాతో సన్మానించి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దీవించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారి ఆధ్వర్యంలో పల్లపు బుద్ధుడు గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించి శాలువాతో పూలమాలతో సన్మానించి కేక్ కటింగ్ చేసినారు చిట్యాల కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద బిజెపి చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్ మరియు చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో పల్లపు బుద్ధుడు గారిని శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు తన పుట్టినరోజు సందర్భంగా చిట్యాల ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ నరేష్ గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్, పీకే వెంకన్న, పాకాల దినేష్ ఇమ్మడి విజయ్, రావుల వెంకన్న, లింగస్వామి, ఆగు సైదులు, నరేష్, సందీప్, ఆరిఫ్, ఎల్లయ్య, రమేష్, నాగరాజు, శివ, నరసింహ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్