అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంఛార్జిగా అవ్వారి భాస్కర్ నియామకం
*అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంఛార్జిగా అవ్వారి భాస్కర్ నియామకం*
*అవ్వారి భాస్కర్ నియామకంతో పద్మశాలి యువతలో నయా జోష్*
*వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పద్మశాలి యువత పాత్ర కీలకం*
*రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగాలి*
*దేశవ్యాప్తంగా యువజన కమిటీలు* - *అవ్వారి భాస్కర్*
అఖిల భారత పద్మశాలి సంఘం మీడియా విభాగం అధ్యక్షులు *అవ్వారి భాస్కర్* కు అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలను సంఘ అధ్యక్షులు కందగట్ల స్వామి ఇచ్చారు. ఈ మేరకు నారాయణగూడ లోని పద్మశాలి భవన్ లో నియామక పత్రాన్ని గురువారం అప్పగించారు . ఈ సందర్భంగా సంఘ పెద్దలు అవ్వారి భాస్కర్ ని ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా , రాష్ట్ర అధ్యక్షులుగా అవ్వారి భాస్కర్ సుదీర్ఘకాలంగా సేవలందించారు. భాస్కర్ సేవలను గుర్తించి అఖిల భారత పద్మశాలి సంఘంలో మీడియా విభాగం జాతీయ అధ్యక్షునిగా నియమించారు. తాను చేపట్టిన ప్రతి పదవిని బాధ్యతగా స్వీకరించి ఆ పదవులకే భాస్కర్ వన్నె తెచ్చారు. మీడియా రంగంలో భాస్కర్ కు ఉన్న అనుభవం అఖిల భారత పద్మశాలి సంఘం చేస్తున్న కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించడంలో వీరి సేవలు గణనీయం. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు కలిగి, సమైక్య రాష్ట్రంలో జరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని జరిగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొని పోలీసుల ఫైరింగ్ లో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఢిల్లీ కేంద్రంగా జర్నలిస్టుగా పనిచేస్తూనే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కో- కన్వీనర్ గా తన బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ H-143 సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఢిల్లీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ (IJU)కి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమింపబడ్డారు. ఒక చేనేత కార్మికుని బిడ్డగా వృత్తిపై ప్రేమతో చేనేత పనిని నేర్చుకొని కొనసాగిస్తూ, అంతరించిపోతున్న వృత్తిని కాపాడుకోవాలని ఉద్దేశంతో జీరో జీఎస్టీ ఉద్యమంలో భాగంగా తాను సైతం చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేతతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించారు. వివిధ రాష్ట్రాలలో పద్మశాలి ప్రముఖ నాయకులతో ఏర్పడిన సంబంధం, పరిచయాలు జాతీయస్థాయిలో యువజన సంఘాన్ని పటిష్టం చేయడంలో భాస్కర్ తన విధులు నిర్వహిస్తారనే నమ్మకంతో సంఘం పెద్దలు నూతన బాధ్యతలు ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ అవ్వారి భాస్కర్ ఆధ్వర్యంలో యువజన సంఘం పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవ్వారి భాస్కర్ మాట్లాడుతూ అఖిల భారత పద్మశాలి యువజన విభాగం అధ్యక్షుడు *ప్రతమేష్ కోటే* సమన్వయంతో వివిధ రాష్ట్రాల యువజన సంఘం బాధ్యులను ప్రోత్సహిస్తూ, వారికి తగిన దిశానిర్దేశం చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటించి యువజన సంఘాలను పటిష్టం చేస్తానని, రాజకీయాలలో యువత పాత్ర పెరగాలని అన్నారు. తనపై నమ్మకంతో ఉంచిన నూతన బాధ్యతలను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాధికారంలో వాటా లేని కులాలు అంతరించిపోతాయని ఆనాడే చెప్పారని అందుకే యువత రాజ్యాధికారంలో వాటాకై పోరాడి సాధించుకోవాలని, తన జాతి మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని, ఆ వైపు యువతతో కలిసి అడుగులు వేస్తామని చెప్పారు. అనంతరం అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వనం విశ్వనాథం, మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతుల, చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత, రాజకీయ విభాగం అధ్యక్షులు బొల్ల శివశంకర్ తదితరులు భాస్కర్ ని ఘనంగా సన్మానించారు.
Comments
Post a Comment