ఆర్యవైశ్య కుటుంభానికి లివర్ ట్రాన్స్ పరెంట్ కోసం ఆర్థిక సహాయం అందించిన గుత్తా అమిత్ రెడ్డి


 ఆర్యవైశ్య కుటుంభానికి లివర్ ట్రాన్స్ పరెంట్ కోసం ఆర్థిక సహాయం అందించిన గుత్తా అమిత్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం లోని మన ఆర్యవైశ్య సోదరుడు 

నాంపల్లి వాసి వీరమల్ల చంద్రశేఖర్ దీర్ఘకాలికంగా "లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతూ చివరి దశగా లివర్ ట్రాన్స్ పరెంట్ ( మార్పిడి) కోసం కిమ్స్ ఆస్పత్రిలో 30 లక్షల రూపాయలు వ్యయంతో చికిత్స చేయించుకోవడానికి సిద్ధపడి, ఉన్న ఇల్లు 13 లక్షలకు అమ్ముకొని, మిగతా 17 లక్షలకు ఆర్థిక ఇబ్బంది పడుతున్న క్రమంలో వారి కుమార్తె అఖిల అభ్యర్ధన మేరకు ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఆర్యవైష్యుల కు అండ దండ గా వెన్నంటి వుండే .గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి దృష్టికి తీసుక రావడం తో వీరమల్ల చంద్రశేఖర్ కుమార్తె అఖిల కు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లక్ష 100000. రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సహాయం చేసిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారికి ముఖ్యంగా గుత్తా అమిత్ రెడ్డి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి యమా దయాకర్ లు కృతజ్ఞత లు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా నాయకులు,(చండూరు) తేలు కుంట్ల జానయ్య, మంచుకొండ సంజయ్ లు ఆపరేషన్ కు పూర్తిగా సహకరిస్తున్నారని, సాటి ఆర్యవైష్యులుగా వారి వంతుగా సహకరించి ఒక పేద ఆర్యవైశ్య సోదరుని ఆరోగ్యం బాగుచేయించలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు కోరారు. వీరమల్ల అఖిల ఫోన్ పే నెంబర్ 7993325395 ను అయన తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్