మిషిన్ భగీరథ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల ధర్నా*

 





*ఇంట్రా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించండి ఎర్రమంజిల్ లోని 

మిషిన్ భగీరథ కార్యాలయం వద్ద  కాంట్రాక్టర్ల ధర్నా*


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం అని చెబుతున్న మిషన్ భగీరథ పనులు చేసిన  కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్యాలయానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి ని కలిసి కార్యాలయం ముందు బైఠాయించి తమ బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు శుద్ధమైన నీళ్లు అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా తామంతా ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఇంట్లోని మహిళల బంగారం, బంధువులు స్నేహితులు వద్ద అప్పులు చేసి మరి పనులు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేసి 5ఏళ్ళు గడుస్తున్నా తమకు రావలసిన బిల్లులు రాకపోవడంతో తమ పరిస్థితి అద్వానంగా తయారైందని వాపోయారు. సొంత ఊర్లలో తిరగలేని పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమకు రావలసిన బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్