ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి - నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం
ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి - నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం
నల్గొండ:
ముదిరాజ్ జర్నలిస్టు పై దాడి చేసి అసభ్య పదజాలంతో ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ సంఘం నల్గొండ జిల్లా కమిటీ, ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెద్ద గడియారం చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని, అతని MLC పదవి తొలగించే వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కేశబోయిన శంకర్, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్ట సుధాకర్, ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ ముదిరాజ్ చిట్టబోయిన అంజయ్య చాగంటి రాములు చాగంటి వెంకన్న , గుడిసె పరుష రాములు సింగారపు మల్లయ్య తదితరు పాల్గొన్నారు.
Comments
Post a Comment