తెలంగాణ టింబర్, సా మిల్స్ ఆధ్వర్యంలో కోలేటి దామోదర్ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం
తెలంగాణ టింబర్, సా మిల్స్ ఆధ్వర్యంలో కోలేటి దామోదర్ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా 61వ జన్మదినోత్సవం పురస్కరించుకొని.. దిల్ సుఖ్ నగర్ లోని తెలంగాణ టింబర్, సా మిల్స్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతానికి చెందిన కోలేటి దామోదర్ గుప్తాను సీఎం కేసీఆర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ...వైశ్యులకు అవసరమైన సహాయ సహాకారలు అందిస్తున్న దామోదర్ గుప్త ఆయురారోగ్యాలు అందాలని కోరుతూ వేలాది మందికి పేదలకు భారీగా అన్నదానం చేశారు. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారని తెలంగాణ టింబర్,సా మిల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, సాయి తులసీ భవనం అధ్యక్షుడు చకిలం రమణయ్య అన్నారు. ఈ అన్న దాన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సింహ గుప్త, కార్యదర్శి సింగికొండ నర్సింహ్మ, జయశ్రీ పాల్గొన్నారు.
Comments
Post a Comment