కౌటికె విఠల్ ఆధ్వర్యంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా అన్నదానం


 కౌటికె విఠల్ ఆధ్వర్యంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా అన్నదానం




ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగం జాతీయ సలహాదారులు, భారతీయ జీవిత బీమా సంస్థలో నంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ 


కౌటికె విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ సలహా మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా మేము చేసిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా వారు పాల్గొని కెకును కట్ చేసి అందరికీ తినిపించడం మా అదృష్టం అన్నారు. వారు కూడా సహ పంక్తిలో మాతో కలిసి భోజనం చేశారని అన్నారు. అంతే కాకుండా వారి ఆయురారోగ్యాలు బాగుండాలని మరిన్ని పదోన్నతులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ధన క్రాప్స్ అధినేత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట రవి కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ విభాగము అధ్యక్ష, కార్యదర్శులు వూర బాబు రావు, చక్రపాణి, తెలంగాణ అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్, కార్యదర్శి వేంకటేశ్వరులు, కోశాద్యక్షులు మురంశెట్టి శ్రీనివాస్, నార్ల దీపక్, కౌటికె ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులకు ఆహార ప్రసాదాన్ని పొందిన అన్నార్తులకు కౌటికె విఠల్ ధన్యవాదములు తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్