Posts

Showing posts from July, 2023

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరసన దీక్ష

Image
 ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరసన దీక్ష ఈరోజు తేదీ 31 జులై 2023 సోమవారం రోజున కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో వైశ్య నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ, ఇరుకుల్ల రామకృష్ణ, గంప శ్రీనివాస్ మరియు కరీంనగర్ పట్టణ వైశ్య ప్రముఖులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఏసీబీ నెట్‌లో పంచాయతీ కార్యదర్శి

Image
 ఏసీబీ నెట్‌లో పంచాయతీ కార్యదర్శి ఏసీబీ నెట్‌లో మహమ్మదాబాద్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా నంచెర్ల గ్రామపంచాయతీ, పంచాయతీ కార్యదర్శి పాండురంగయ్య. ఫిర్యాదుదారు శ్రీమతి నుండి.  సేవకుల సువర్ణ R/o నంచెర్ల గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా నుండి 9,000/- లు లంచం మొత్తాన్ని స్వీకరిస్తు ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుకు 4,41,320/- MGNREGS కింద CC రోడ్డు వేయడానికి సంబంధించిన బిల్లు   మొత్తం రూ. (02) చెక్కులను జారీ చేసినందుకు ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేశారు. స్వాధీనం చేసుకున్న లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి పాండురంగయ్య. రెండు చేతుల వేళ్లు మరియు కుడి వైపు వెనుక జేబు అతని ప్యాంటు సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. నిందిత అధికారి (AO) శ్రీ పాండు రంగయ్య ను అరెస్టు చేసి మహబూబ్‌నగర్ జిల్లా గౌరవనీయుల నాంపల్లిలోని SPE మరియు ACB కేసుల కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరపరిచామని కేసు విచారణలో ఉందనీ ఏసీబీ అధికారులు తెలిపారు .

నాగం ఫౌండేషన్ సౌజన్యంతో అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థకు చేయూత

Image
 *నాగం ఫౌండేషన్ సౌజన్యంతో అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థకు చేయూత* నల్గొండ పట్టణ కేంద్ర లో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ వాహనం మరమ్మత్తుల కోసం *నాగం ఫౌండేషన్ చైర్మన్ డా" నాగం వర్షిత్ రెడ్డి గారు స్పందించి 15 వేల రూపాయలు అందజేశారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నాగం ఫౌండేషన్ ఎల్లవేళలా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైన ముందుంటుందని తెలియచేశారు సమాజంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నపూర్ణ సంస్థ యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో నాగం ఫౌండేషన్ చైర్మన్ *డా"నాగం వర్షిత్ రెడ్డి గారు* బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరచారి గారు,జిల్లా అధికార ప్రతినిధి బోగరి అనిల్ కుమార్ గారు,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నరసింహ గారు మరియు అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భీమనపల్లి శ్రీకాంత్ , శివరాం, నరేష్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను మర్యాదపూర్వకంగా కలసిన బండి సంజయ్

Image
 బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను మర్యాదపూర్వకంగా కలసిన బండి సంజయ్ తెలంగాణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో పాటు రాధా మోహన్ అగర్వాల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నడ్డా మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

కెనడా హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

Image
  కెనడా  హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా  నోవా మల్టీఫెస్ట్ వేడుకలు.   తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు,  మేము ఎక్కడ ఉంటే  అక్కడే  పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్న మన భారతీయులు  ముఖ్యంగా మన తెలుగు వారు  విశాల్ భరద్వాజ్ మరియు వారి టీం భ్యారి, .టీనా, సెలెస్ట్ ల ఆధ్వర్యంలో కెనడా NS లీడర్ పార్టీ లీడర్ మరియు యార్మౌత్  MLA  జాక్ చర్చిల్, NDP లీడర్ క్లాజుడై చందర్ మరియు క్లేటొన్   పార్క్ MLA రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసి నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.   8000 మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీమతి మరియు  శ్రీహరి చల్లా మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు.   శ్రీహరి బృందం, శ్రీమతి మరియు శ్రీ .ఫణి వంక , శ్రీమతి మరియు  శ్రీ. శివ మారెళ్ళ, శ్రీమతి మరియు శ్రీ. చంద్రా తాడేపల్లి శ్రీమతి మరియు శ్రీ .వెంకట్ వేలూరి , శ్రీ .శ్రీనివాస చిన్ని శ్రీ.పృద్వి కాకూరు , శ్రీ...

కామన్ సర్వీసెస్ సెంటర్ (సిఎస్ సి) సేవలను అందించాటానికి జాతీయ మెగా కాన్ క్లేవ్ ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Image
కామన్ సర్వీసెస్ సెంటర్ (సిఎస్ సి) సేవలను అందించాటానికి జాతీయ మెగా కాన్ క్లేవ్ ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) ద్వారా కామన్ సర్వీసెస్ సెంటర్ (సిఎస్ సి) సేవలను అందించాటానికి కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జాతీయ మెగా కాన్ క్లేవ్ ను ప్రారంభించారు. పీఏసీఎస్ లు, సీఎస్ సీల విలీనంతో సహకార సంఘాల బలోపేతానికి, డిజిటల్ ఇండియాను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన రెండు తీర్మానాలు నేడు నెరవేరుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 300కు పైగా పథకాలను సీఎస్ సీతో అనుసంధానం చేశామని, గ్రామంలోని పేద ప్రజలకు సీఎస్ సీని తీసుకెళ్లేందుకు పీఏసీఎస్ లను మించిన పెద్ద మార్గం మరొకటి ఉండదన్నారు. పీఏసీఎస్ లు, సీఎస్ సీల విలీనంతో పేదలకు సౌకర్యాలు పెరుగుతాయని, దీనితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి, బలం చేకూరుతుందని, ఇది దేశాభివృద్ధికి గరిష్ఠ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి దోహదపడుతుందన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటే దాని అతిచిన్న యూనిట్ అయిన పీఏసీఎస్ ను బలోపేతం చేయాలని, పీఏసీఎస్ లు బలంగా ల...

IFWJ జాతీయ కార్యదర్శి గా భరత్ కుమార్ శర్మ నియామకం

Image
 IFWJ జాతీయ కార్యదర్శి గా భరత్ కుమార్ శర్మ నియామకం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 132 వ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మరో పదవి లభించింది. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ ప్రతిపాదనల మేరకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పాండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణకు చెందిన భరత్ కుమార్ శర్మకు ఐఎఫ్డబ్ల్యూజే IFWJ జాతీయ కార్యదర్శి గా అవకాశం కల్పించారు. నేటి నుంచి ఆ పదవి కొనసాగుతుందని జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పాండేజీ తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ TJU ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొనసాగుతున్న భరత్ కుమార్ శర్మను జాతీయ నాయకత్వం గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు సారధ్యంలో IFWJ జాతీయ కార్యదర్శి గా నియమించిన ఆయనను సన్మానించారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు మరియు బృందానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి ...

IFWJ 132వ నేషనల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పాల్గొన్న TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు

Image
 IFWJ 132వ నేషనల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరులో జరుగుతున్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 132వ నేషనల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ గు లో కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య పాల్గొననున్నారు జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ హాజరై జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జర్నలిస్టుల కోసం పోరాడుతున్న వివిధ అంశాలపై నేడు మాట్లాడనున్నారు కర్ణాటకలో జరుగుతున్న మహాసభకు తెలంగాణకు సముచిత స్థానం కల్పించినందుకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

*వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి* వైశ్య వికాస వేదిక డిమాండ్

Image
 *వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి*  వైశ్య వికాస వేదిక డిమాండ్  హైదరాబాద్ : వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ లో ఏ బి సి డి కేటగిరీలు చేయాలని వైశ్య వికాస వేదిక డిమాండ్ చేసింది. నేడు వేదిక వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో *వైశ్యులు- ఆత్మగౌరవం... హక్కుల సాధన* అంశంపై చర్చ గోష్టి జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా జర్నలిస్టులు, టీచర్లు, అడ్వకేట్లు హాజరై ఈ గోష్టిలో వైశ్యుల ఆత్మగౌరవం, హక్కులు, రాజకీయ వాటాలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ గోష్టికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ, కోశాధికారి కల్వ సుజాత అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేధోమధనం జరిగింది. వైశ్యుల ఆత్మగౌరవ గౌరవం కోసం సభఏడు తీర్మానాలను ఆమోదించింది. 1.వైశ్య కమిషన్ ఏర్పాటు, 2.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ, 3.జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా , 4.వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు 5.వైశ్య విద్యార్థుల కోస...

మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి పాల్పడిన నిందితులను కటినంగా శిక్షించాలి.- పాలడుగు ప్రభావతీ

Image
 *మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఆదివాసీ మహిళలను  నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి పాల్పడిన నిందితులను కటినంగా శిక్షించాలి.- పాలడుగు ప్రభావతీ ఐద్వా KVPS dyfi అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం..     *మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.*    మణిపూర్‌లోని కాంగ్‌ఫోక్సీ జిల్లాలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న ఘటనను తీవ్రంగా ఖండస్తున్నామనీ  ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతీ అన్నారు.  ఈరోజు ఐద్వా కెవిపియస్ dyfi ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం చేయడo జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు వెలుగులో కొచ్చాయనీ  ఈ ఘటనలో ఆ మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పది ఆ మహిళల  కుటుంబ సభ్యులను హత్యలు చేసినట్లుగా కూడా వార్తలొస్తున్నాయ  ఈ దుర్మార్గమైన ఘటన  తీవ్ర నిరసన, ఆగ్రహం వెల్లువెత్తకుండా ఆ గుంపులో ఒకరిని, సాయంత్రానికి మరో ముగ్గురిని అరెస్టు చేశారని ఇప్పటిదాకా నోరెత్తని ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు తాము తీవ్రంగా బాధపడుతున్నా మంటూ మొసలి కన...

*నూతన జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన జగిని వెంకన్న.

Image
 *నూతన జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన జగిని వెంకన్న....    ఈ రోజు నూతన జిల్లా జాయింట్ కలెక్టర్  జె. శ్రీనివాస్ గారిని జగిని టెక్స్ టైల్స్ అధినేత జగిని వెంకన్న మర్యాద పూర్వకంగా కలిసి బొకే, చేనేత శాలువా తో సత్కరించారు..  ఈ సందర్బంగా జగిని సేవల గురించి, ప్రతీ సంవత్సరo  చలివేంద్ర ములు,ట్రాఫిక్ బారీకేడ్స్ ,మట్టి గణపతి విగ్రహంల పంపిణి, మరియు ప్రజా కార్యక్రమం ల గురించి వివరించారు...  ఈ సందర్బంగా జేసీ గారు జగిని వెంకన్నను అభినందించి నారు...

అందరికీ సమాన న్యాయం జరగాలంటే యూనియన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు

Image
 అందరికీ సమాన న్యాయం జరగాలంటే యూనియన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు గజ్వేల్ లో 13 రోజుల క్రితం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయినా వారి కుటుంబాలను కలిసి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గాలి తెలంగాణకి, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా సాకింది , సోకింది అని చెప్పడానికి గజ్వేల్ లో జరిగిన సంఘటన నిదర్శనం అని బిజెపి నాయకుడు దుబ్బాక ఎమ్మేల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గత పదమూడు రోజుల కింద రెండు వర్గాల ప్రజల మధ్య జరిగిన సంఘర్షణలో గాయపడ్డ , జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులకు రఘునందన్ రావు పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం లో చాలా సమస్యలు ఉన్నాయని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూనియన్ సివిల్ కోడ్ అవసరమని చాలామంది అభిప్రాయ పడుతున్నారనీ అన్నారు. గజ్వేల్ లో జరిగిన సంఘర్షణలో ఓ వర్గానికి ఒక న్యాయం ,మెజారిటీ వర్గ ప్రజలకు మరో న్యాయం జరిగిందని మెజారిటీ ప్రజలు జైల్లో ఉంటే మరో వర్గం ప్రజలకు బెయిల్ దొరకడం ఏంటని అన్నారు.మెజారి...

సహారా రీఫండ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా

Image
  సహారా రీఫండ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూ ఢిల్లీలో CRCS - సహారా రీఫండ్ పోర్టల్ https://mocrefund.crcs.gov.in/ ప్రారంభించారు. సహారా గ్రూపునకు చెందిన సహకార సంఘాల నిజమైన డిపాజిటర్లు - సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మరియు స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ యొక్క నిజమైన డిపాజిటర్లు క్లెయిమ్లను సమర్పించడానికి ఈ పోర్టల్ అభివృద్ధి చేయబడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, స్కామ్ కారణంగా ఇరుక్కుపోయిన తమ డబ్బును ఇన్వెస్టర్లు తిరిగి పొందబోతున్నారు, ఇది ఒక పెద్ద విజయం. కోట్లాది మంది కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు, ఈ విషయంలో చొరవ తీసుకొని, చిన్న పెట్టుబడిదారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయడానికి భాగస్వాములందరితో చర్చలు జరిపారు. ఇన్వెస్టర్లకు రూ.5...

కేసీఆర్ పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని రేవంత్ అంటున్నాడు-శ్రవణ్

Image
  కేసీఆర్ పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని రేవంత్ అంటున్నాడు-శ్రవణ్ తండ్రి వయసున్న కేసీఆర్ పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని రేవంత్ అంటున్నాడు..ఆలా అనమని రేవంత్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు..? - శ్రవణ్ 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..గాంధీ భవన్ వేదికగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని అవమానపరుస్తూ...వారిని కించపరుస్తున్నాడు. ఇలా ఎవర్ని పడితే వారిని..ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని కించపరుస్తుంటే చూస్తూ ఉరుకుందామా..? - శ్రవణ్  * గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ హోదాలో కూర్చుని ప్రజలను అవమానించామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ కు ఏదైనా ప్రత్యేక లైసెన్స్ ఇచ్చిందా..? - శ్రవణ్  * కేసీఆర్ ను దూషించడం కోసం రేవంత్.. ట్రాన్స్జెండర్లను తన రాజకీయ చర్చల్లోకి లాగుతున్నాడు - శ్రవణ్  * రాజకీయ సంస్కృతిని నాశనం చేసే రాబందు రేవంత్ రెడ్డి - శ్రవణ్  * రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని అవమానపరుస్తూ...వారిని కించపరుస్తున్నాడు - శ్రవణ్  * ఇదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అయితే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు - శ్రవణ్  * బాధ్యతారహితమైన రేవంత...

కృషి విజ్ఞాన కేంద్రం ను సందర్శించిన గోలి మధుసూదన్ రెడ్డి

Image
  కృషి విజ్ఞాన కేంద్రం ను సందర్శించిన గోలి మధుసూదన్ రెడ్డి  ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలీ మధుసూధన్ రెడ్డి కంపసాగర్ గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి...KVK కో-ఆర్డినేటర్ శ్రీనివాస రావు తో మాట్లాడుతూ సిరి దన్యాల గురించీ ప్రజలకూ అవగాహన కల్పించాలి అని మధుసూధన్ రెడ్డి అడగడంతో అందుకు వారు సుముఖత చూపించారు...అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది... ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల అధ్యక్షులు నర్సింగ్ యాదగిరి గౌడ్, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, బీజేపి నల్లగొండ పార్లమెంట్ ఐటి మరియు సోషల్ మీడియా కన్వీనర్ కటకం మల్లిఖార్జున్, కిసాన్ మోర్చ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, మెరుగు భిక్షాపతి, సమర్ధపు నర్సింహ,మహిళా మోర్చ మండల అధ్యక్షురాలు చోల్లేటి నవ్య, మెకల రామక్రిష్ణ,గండికోట గోపి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

*ఐవిఎఫ్ ను గ్రామస్థాయికి తీసుకెళ్లి పటిష్టం చేయండి : అశోక్ అగర్వాల్* కన్నుల పండుగగా ఐవిఎఫ్ దశాబ్ది ఉత్సవం

Image
  *ఐవిఎఫ్ ను గ్రామస్థాయికి తీసుకెళ్లి పటిష్టం చేయండి : అశోక్ అగర్వాల్* కన్నుల పండుగగా ఐవిఎఫ్ దశాబ్ది ఉత్సవం హైద్రాబాద్ (గూఢచారి): గత దశాబ్ద కాలంగా తెలంగాణ లో ఐవిఎఫ్ నాయకులు, సభ్యులు చేస్తున్న కృషి ఫలితంగా పటి ష్టంగా ఎదిగిందని, దీనిని గ్రామస్థాయికి తీసుకెళ్లడం ద్వారా ఐవిఎఫ్ ను మరింత పటిష్టం చేయాలని కేంద్ర కమిటీ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ పిలుపు నిచ్చారు. ఆదివారం హైద్రాబాద్ ఉప్పల్ లోని ఎస్ఎం గ్రాండ్ లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన కేంద్ర కమిటీ సీనియర్ కార్య నిర్వాహక అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్త, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు, టూరిజం కార్పోరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్  ఇతర నాయకులతో కలిసి గ్రీన్ ఇం డియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనం తరం ఉప్పల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో అంత ర్జాతీయస్థాయిలో 23 దేశాలలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలో అమలు చేయడం ద్వారా పది లక్షల మొక్కలు నాటి రాజ్యసభ సభ్యుడు సం...

ఐవియఫ్ దశాబ్ది ఉత్సవాలు

Image
  ఐవియఫ్ దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్: ఐవియఫ్ స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రేపు అనగా 9.7.2023 ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నాగోల్ లోని యస్.వి.యఎం.గ్రాండ్ (ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన) నందు ఐవియఫ్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా జాతీయ అధ్యక్షలు అశోక్ అగర్వాల్, జాతీయ సీనియర్ కార్యనిర్వహక అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త గార్లు పాల్గొంటారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ ప్రమాణ స్వీకారం, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం, హైదరాబాద్ నగరం లోని పలు డివిజన్ ల మహిళ కార్యవర్గ స్వీకారాలు, జిల్లాల అత్యుత్తమ అధ్యక్షులకు అవార్డుల బహుకరణ ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల నుండి రాష్ట్ర IVF మిత్రులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని అయన కోరారు.  

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విముక్తి సంఘం వ్యవస్థాపకుడు అర్థం శ్రీనివాస్ పై దాడి

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విముక్తి సంఘం వ్యవస్థాపకుడు అర్థం శ్రీనివాస్ పై దాడి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరపాలని, ప్రస్తుతము అధ్యక్షుడు గా చెప్పుకుంటున్న అమరవాది వై తొలిగి సక్రమంగా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా లో మాటలు, పాటలు వైరల్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విముక్తి సంఘం వ్యవస్థాపకుడు అర్థం శ్రీనివాస్ పై సోమవారం రాత్రి దాడి జరిగింది. శ్రీనివాస్ చేస్తున్న విమర్శలను తట్టుకోలేక నల్గొండ ఆర్యవైశ్య మహాసభ నాయకుడు అర్థం శ్రీనివాస్ పై దాడి చేసి చంపుతా అని బెదిరించి నట్లు అర్థం శ్రీనివాస్ సోషల్ మీడియాలో తన వాయిస్ పోస్ట్ చేశాడు. అందులో నేను బీద వైశ్యుల కు న్యాయం చేయాలని కోరుకుంటే నా పై దాడి చేస్తారా, ఏది న్యాయం కాదని ఆయన అన్నారు. అమరవాది గ్రూప్ తో తన కు ప్రాణ హాని ఉన్నదని అన్నారు. తన పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దాడిలో తన పెదవి పై గాయం అయినట్లు అయన అన్నారు. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే మాటల వరకే ఉందాలి, కలసి కూర...

భూపతి టైమ్స్ దిన పత్రిక, జూలై, 2, 2023 ను ఈ క్రింద లింక్ టచ్ చేసి చదవండి

Image
  భూపతి టైమ్స్ దిన పత్రిక, జూలై, 2, 2023 ను ఈ క్రింద లింక్ టచ్ చేసి చదవండి

భూపతి టైమ్స్ దిన పత్రిక, జూలై, 1, 2023 ను ఈ క్రింద లింక్ టచ్ చేసి చదవండి

Image
  భూపతి టైమ్స్ దిన పత్రిక, జూలై, 1, 2023 ను ఈ క్రింద లింక్ టచ్ చేసి చదవండి