కేసీఆర్ పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని రేవంత్ అంటున్నాడు-శ్రవణ్


 

కేసీఆర్ పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని రేవంత్ అంటున్నాడు-శ్రవణ్


తండ్రి వయసున్న కేసీఆర్ పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని రేవంత్ అంటున్నాడు..ఆలా అనమని రేవంత్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు..? - శ్రవణ్


120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..గాంధీ భవన్ వేదికగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని అవమానపరుస్తూ...వారిని కించపరుస్తున్నాడు. ఇలా ఎవర్ని పడితే వారిని..ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని కించపరుస్తుంటే చూస్తూ ఉరుకుందామా..? - శ్రవణ్ 


* గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ హోదాలో కూర్చుని ప్రజలను అవమానించామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ కు ఏదైనా ప్రత్యేక లైసెన్స్ ఇచ్చిందా..? - శ్రవణ్ 


* కేసీఆర్ ను దూషించడం కోసం రేవంత్.. ట్రాన్స్జెండర్లను తన రాజకీయ చర్చల్లోకి లాగుతున్నాడు - శ్రవణ్ 


* రాజకీయ సంస్కృతిని నాశనం చేసే రాబందు రేవంత్ రెడ్డి - శ్రవణ్ 


* రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని అవమానపరుస్తూ...వారిని కించపరుస్తున్నాడు - శ్రవణ్ 


* ఇదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అయితే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు - శ్రవణ్ 


* బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకుడ్ని సంఘం నుంచి బహిష్కరించాలి - శ్రవణ్ 


* టీపీసీసీ అధ్యక్షాపదవి నుండి రేవంత్ రెడ్డి ని తొలగించాలని శ్రవణ్ డిమాండ్


హైదరాబాద్ , జులై 18 : మహాత్మాగాంధీ వారసులమని , 120 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు. అలాంటి హోదాలో ఉన్న రేవంత్ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్నాడు. 


రేవంత్ చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం, ఏదిపడితే అది అనడం చేస్తున్నాడు. కించపరచడం తప్పు కాదు కానీ దానిపేరు మీద ఎలాపడితే ఆలా, ఎవర్ని పడితే వారిని అవతలి వ్యక్తి వయసును సైతం లెక్కచేయకుండా అనరాని మాటలు అనకూడదు కదా.. అని శ్రవణ్ ప్రశ్నించారు.


తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్లే తలకాయిపెట్టి , నిద్రాహారాలు లేకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తెలంగాణను దేశానికే తలమానికంగా ఎంతో అభివృద్ధి చేస్తున్న ఆయనను పట్టుకొని నువ్వా ఆడ..మగ..మడావా అని చెప్పని రేవంత్ మాట్లాడుతున్నాడు. ఆలా మాట్లాడడానికి రేవంత్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు. 


తెలంగాణ ప్రజలను అవమానించడం, బాధపెట్టడం, బెదిరించడం, నీచంగా మాట్లాడమని , కించపరిచే పదజాలంతో బాధపెట్టమని రేవంత్ రెడ్డికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ & కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా ప్రత్యేక లైసెన్స్ ఇచ్చారా..? గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ హోదాలో కూర్చుని ఎవర్ని పడితే వారిని ఆలా మాట్లాడమని ఏమైనా చెప్పిందా..?


రాహుల్ గాంధీ నేతృత్వం లో మహిళా విభాగం కార్యదర్శిగా ట్రాన్స్జెండర్ మహిళ అపర్ణా రెడ్డిని నియమించి జాతీయ స్థాయిలో ఎంతో గౌరవం దక్కించుకున్నారు. కానీ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ను దూషించడం కోసం ట్రాన్స్జెండర్లను తన రాజకీయ చర్చల్లోకి లాగి దుర్భాషలాడుతున్నాడు. 


AICC అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే , సీనియర్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ మరియు శ్రీమతి ప్రియాంక గాంధీ లు ఎందుకు..రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే సహిస్తున్నారు..? రాజకీయ సంస్కృతిని నాశనం చేసే రాబందుగా రేవంత్ రెడ్డి మారిన విషయాన్ని ఏఐసీసీ ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు నియంత్రిచడం లేదు? చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కొత్త ఆచారమా..? 


 ట్రాన్స్జెండర్ల వర్గాన్ని, వివిధ బీసీ కులాలను అవమానించేలా రేవంత్ మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే మాట్లాడాడు. యాదవులను పేడ పిసుకుంటారని కించపర్చడం, దొమ్మర్లను, వంశరాజులను హేళన చేయడం..మిగతా కులాలను చులకన చేయడం రేవంత్ కు అలవాటుగా మారింది. గొల్ల కురుమలు, బీసీలను, ఎస్సిలను, ఎస్టీ లను ఇలా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల వైద్యులుగా నియమించి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని గౌరవించారు. సీఎం కేసీఆర్ పాలనలో సమాజంలోని ప్రతి వర్గం ఎంతో గౌరవంగా ఉంది. ఎలాంటి కులం, మతం, లింగం విభేదాలు , వివక్షత లేకుండా కేసీఆర్ గౌరవిస్తున్నారు. అన్ని కులాల వారిని మతాలవారిని ప్రోత్సహిస్తూ..వారి అభివృద్ధికి చేయూత ఇస్తున్నాడు. 


మరి 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..గాంధీ భవన్ వేదికగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని అవమానపరుస్తూ...వారిని కించపరుస్తున్నాడు. ఇలా ఎవర్ని పడితే వారిని..ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని కించపరుస్తుంటే చూస్తూ ఉరుకుందామా..? అని శ్రవణ్ ప్రశ్నించారు.


 పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ఓ రాజకీయ నేత..కాంగ్రెస్ పార్టీ లో పెద్ద స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే..ఇంతకన్నా పెద్ద హోదాలో ఉన్న AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ మరియు శ్రీమతి ప్రియాంక గాంధీ లు ఎందుకు మాట్లాడారు. ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్కృతా..? లేక రేవంత్ రెడ్డి సంస్కృతా..? ఇదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అయితే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు. రేవంత్ రెడ్డి సంస్కృతి అయితే అధిష్టానం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.


పౌరుష పదజాలం, బూతుపదజాలమే రాజకీయమా..? ఇదేనా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కి నేర్పింది..? లేక సమాజానికి నేర్పింది..? కాబట్టి సభ్యసమాజం ఆలోచించండి. విధివిధానం తప్పు ఉంటె కించపరచండి, మంచి జరగాలని డిమాండ్ చేయండి. అంతే కానీ ఎలాపడితే ఆలా కించపరుస్తాం అంటే కుదరదు. ఓ టార్గెట్ గా కేసీఆర్ గారిని ,కేసీఆర్ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే ఆలా అనడం, హరీష్ , కేటీఆర్ లను బిర్లా అని , రంగ అని కేసీఆర్ గారిని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్ అని , ఆడ , మగ , మాడా అని ఇలా పడితే ఆలా రేవంత్ అంటున్నాడు. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాసినట్లు శ్రవణ్ తెలిపారు. మరి రేవంత్ ఫై చర్యలు తీసుకుంటుందా..లేదా అనేది చూడాలి. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి ఫై చర్యలు తీసుకుంటారు. బేషరతుగా రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్లు, వెనుకబడిన తరగతులు,ఇతర వర్గాలకు , బీసీలకు క్షమాపణలు చెప్పాలి.


'చౌకీదార్ చోర్ హై' అంటూ ఓ ర్యాలీలో ప్రధాని మోడీ ఫై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గుజరాత్ కోర్ట్ లో కేసు వేస్తే..రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పోయింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి..? ఓ ముఖ్యమంత్రి ని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్ అంటాడు. ఎవరి చార్ల్స్ శోభరాజ్..? అతడికి కేసీఆర్ కు పోలిక ఏంటి..? అసలు ఇలా మాట్లాడొచ్చా..? వయసు కు గౌరవం ఇవ్వవు..ఆయన కుర్చీకి గౌరవం ఇవ్వవు..తెలంగాణ కోసం కష్టపడినా దానికి గౌరవం ఇవ్వవు..ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న నీ పదవికి గౌరవం ఇవ్వవు..కాంగ్రెస్ పార్టీ కి గౌరవం ఇవ్వవు..బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకుడ్ని సంఘం నుంచి బహిష్కరించాలి. వెంటనే టీపీసీసీ అధ్యక్షాపదవి నుండి రేవంత్ రెడ్డి ని తొలగించాలని శ్రవణ్ డిమాండ్ చేసారు.

రేవంత్ తన రాజకీయ ప్రసంగాలలో తోటి మనుష్యులు అనే కనీస ఇంగితం లేకుండా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని, బీసీ కులాలను కించపరిచి, అవమానించేలా మాట్లాడినందుకు చట్ట ప్రకారం తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ లకు జాతీయ మానవ హక్కుల సంఘానికి, జాతీయ ఓబీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లు శ్రవణ్ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్