*ఐవిఎఫ్ ను గ్రామస్థాయికి తీసుకెళ్లి పటిష్టం చేయండి : అశోక్ అగర్వాల్* కన్నుల పండుగగా ఐవిఎఫ్ దశాబ్ది ఉత్సవం


 

*ఐవిఎఫ్ ను గ్రామస్థాయికి తీసుకెళ్లి పటిష్టం చేయండి : అశోక్ అగర్వాల్*
కన్నుల పండుగగా ఐవిఎఫ్ దశాబ్ది ఉత్సవం







హైద్రాబాద్ (గూఢచారి): గత దశాబ్ద కాలంగా తెలంగాణ లో ఐవిఎఫ్ నాయకులు, సభ్యులు చేస్తున్న కృషి ఫలితంగా పటి ష్టంగా ఎదిగిందని, దీనిని గ్రామస్థాయికి తీసుకెళ్లడం ద్వారా ఐవిఎఫ్ ను మరింత పటిష్టం చేయాలని కేంద్ర కమిటీ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ పిలుపు నిచ్చారు. ఆదివారం హైద్రాబాద్ ఉప్పల్ లోని ఎస్ఎం గ్రాండ్ లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన కేంద్ర కమిటీ సీనియర్ కార్య నిర్వాహక అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్త, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు, టూరిజం కార్పోరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్  ఇతర నాయకులతో కలిసి గ్రీన్ ఇం డియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనం తరం ఉప్పల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో అంత ర్జాతీయస్థాయిలో 23 దేశాలలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలో అమలు చేయడం ద్వారా పది లక్షల మొక్కలు నాటి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపడుతున్న కార్యక్రమం లో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. మహిళా విభాగ్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ వైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయరంగంలో వైశ్యులకు సముచిత ప్రాధాన్యత కల్పించడం అభినందనీ యమని, బిఆర్ ఎస్ అంకితభావంతో పనిచేస్తున్న ఉప్పల శ్రీనివాసు శాసనసభ లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్త మాట్లాడుతూ సంఘ పటిష్టతకు సభ్యత్వమే మూలమని సభ్యత్వ సంఖ్య పెంచడానికి అన్ని జిల్లాలు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్య క్రమాలతో పాటు మహిళలను ప్రతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయడాన్ని ఆయన అభినందించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు పేద ఆర్యవైశ్య మహిళలకు అన్ని జిల్లాల్లో కుట్టుమిషన్లు అందజేయడానికి ముందుకురావడం చాలా సంతోషం గా ఉందని, జిల్లా అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. పేద యువతులకు వివాహాలకు ఉచితంగా పుస్తె, మెట్టెల పంపిణీ,పేద వైశ్య యువతీ, యువకుల ఉన్నత విద్య కోసం ఆర్ధిక సహాయం అందించడం, ఐఏఎస్, ఐపిఎస్ ప్రిలిమినరీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించ డం, మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ల పంపిణీతో పాటుగా ఇంకా అనేక కార్యక్రమాలను గత దశాబ్దకాలంగా చేపడుతున్నామని తద్వారా రాష్ట్రంలో ఐవిఎఫ్ కు మరో ప్రత్యామ్నాయం లేదని చాటి చెప్పామని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైశ్యు లను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు వైశ్యులకు కూడా వర్తింపజేస్తున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, సిఎం రిలీఫ్ ఫండ్, రేషన్ కార్డులు తదితర వసతులు కల్పిస్తున్నారని వి వరించారు. ఉప్పల్ భాగాయత్ వైశ్యులకు అయిదు ఎకరాల భూమిని కేటాయించడం ముఖ్యమంత్రికి వైశ్యులపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ఈ పథకాలు అందని అర్హులైన లబ్దిదారులు ఐవిఎఫ్ నాయకులను సంప్రదించాలని కోరారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తు న్న వార్షికోత్సవాలలో స్వచ్చందంగా పాల్గొనడమే కాకుండా అన్ని జిల్లాల్లో సేవా, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారంలోనే కాకుండా సేవారంగంలో కూడా ముందుంటారని తెలిపారు. ఐవిఎఫ్ చేపడు తున్న కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు వినోద్ అగర్వాల్, కార్యవర్గ సభ్యులు గట్టు మహేష్, కక్కిరాలరమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించిన సమావేశంలో సీనియర్ ఉపాధ్యక్షులు పిఎస్ఆర్ మూర్తి, కాచం కృష్ణమూర్తి, రాష్ట్ర సలహా దారు ముస్త్యాల సత్తయ్య, ఉడతా పురుషోత్తం, యువజన విభాగ్ అధ్యక్షుడు కట్టా రవికుమార్, రాజకీయ విభాగం అధ్యక్షుడు ఆదిత్య, మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాధీనమ్, యువజన విభాగ్ ప్రధాన కార్యదర్శి రొంపల్లి సంతోష్, కోశాధికారి కోటేశ్వర్ రావు, ఐవిఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న, మహిళా విభాగ్ అధ్యక్షురా లు చందా భాగ్యలక్ష్మి, కార్యదర్శి మిడిదొడ్డి శైలజ, కోశాధికారి భువన, పూర్వాధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల, ఉటుకూరు శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, కొల్పూరు నరేష్, బిజ్జల శ్రీనివాస్, బిజ్జాల నగేష్, రేపాల బద్రాద్రి రాములుతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళ, యువజన విభాగ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్, ఇతర కార్యవర్గ సభ్యులు హై ద్రాబాద్ నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన మహిళా విభాగ్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రక్తదానం ద్వారా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన సేవాదళ్ అధ్యక్షుడు బాలును ఘనంగా సత్కరించారు. కొంతమందికి రాష్ట్రస్థాయిలో స్థానం కల్పిస్తూ నియామక పత్రాలు అందించారు. తొలుత కుమారి స్నిగ్ధ ప్రదర్శించిన స్వాగత నృత్యం అందరిని ఆకట్టుకుంది. గత పదేళ్లుగా ఐవిఎఫ్ తెలంగాణ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై డాక్యు మెంటరీ ప్రదర్శించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 10 కిలోల కేకు కట్ చేశారు. తొలుత కార్యక్రమానికి నీలా శ్రీధర్ వాసవీమాత ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. అనంతరం పేద ఆర్యవైశ్య మహిళల కు 10 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్