అందరికీ సమాన న్యాయం జరగాలంటే యూనియన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు


 అందరికీ సమాన న్యాయం జరగాలంటే యూనియన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు


గజ్వేల్ లో 13 రోజుల క్రితం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయినా వారి కుటుంబాలను కలిసి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గాలి తెలంగాణకి, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా సాకింది , సోకింది అని చెప్పడానికి గజ్వేల్ లో జరిగిన సంఘటన నిదర్శనం అని బిజెపి నాయకుడు దుబ్బాక ఎమ్మేల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గత పదమూడు రోజుల కింద రెండు వర్గాల ప్రజల మధ్య జరిగిన సంఘర్షణలో గాయపడ్డ , జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులకు రఘునందన్ రావు పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం లో చాలా సమస్యలు ఉన్నాయని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూనియన్ సివిల్ కోడ్ అవసరమని చాలామంది అభిప్రాయ పడుతున్నారనీ అన్నారు. గజ్వేల్ లో జరిగిన సంఘర్షణలో ఓ వర్గానికి ఒక న్యాయం ,మెజారిటీ వర్గ ప్రజలకు మరో న్యాయం జరిగిందని మెజారిటీ ప్రజలు జైల్లో ఉంటే మరో వర్గం ప్రజలకు బెయిల్ దొరకడం ఏంటని అన్నారు.మెజారిటీ వర్గ ప్రజలకు అనచలని చూడటం దురదృష్టకరం అని,ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని దేశం లో సమన్యాయం ఉండాలని కులం , మతం,ప్రాంతాల మీద చట్టం మారకుడదని యూనియన్ సివిల్ కోడ్ తెచ్చే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వం లో బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనీ అన్నారు. మతం పేరు మీద ,కులం పేరు మీద ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశం అని దీన్ని భారత ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.యూపీయే అని పేరు పెడితే ఎవరు నమ్ముతలేరని ,UPA లో ఉన్న వారందరూ దేశ ద్రోహులే అని ప్రజలు అనుకుంటున్నారని అందుకే ప్రజలు నరేంద్ర మోడీ కి ఓటు వేస్తున్నారని భావించి అందుకే ఒకటి రెండు సార్లు UPA ఫెలైందని కాబట్టి అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇండియా అని పేరు మార్చుకున్నారనీ అన్నారు. తమకు ఎవరు నమ్ముత లేరని UPA లో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనిచించింది కాబట్టి ఇండియా అని పేరు పెట్టుకున్నారు అని అన్నారు.వచ్చే ఎన్నికల్లో జరిగేటు వంటి యుద్ధం భారతీయులకి ,ఇండియా అని పేరు పెట్టుకున్న UPA కూటమికి మధ్య జరిగే యుద్ధం అని అన్నారు. ఈ దేశం లో మెజారిటీ ప్రజలు 74 శాతం హిందువులు ఉన్నారని చెప్పుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో 20 శాతం రాక ముందే ఇట్లుంటే యూనియన్ సివిల్ కోడ్ అవసరం ఉందా లేదా దీన్ని ప్రజలు గమనించాలి అని రఘునందన్ రావు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ , బిజెపి రాష్ట్ర నాయకుడు కప్పర ప్రసాద్ రావు, ధరం గురువా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నలగమ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాములు పట్టణ అధ్యక్షులు మధుసూధన్ గజ్వేల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్