మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి పాల్పడిన నిందితులను కటినంగా శిక్షించాలి.- పాలడుగు ప్రభావతీ
*మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి పాల్పడిన నిందితులను కటినంగా శిక్షించాలి.- పాలడుగు ప్రభావతీ
ఐద్వా KVPS dyfi అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం..
*మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.*
మణిపూర్‌లోని కాంగ్‌ఫోక్సీ జిల్లాలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న ఘటనను తీవ్రంగా ఖండస్తున్నామనీ ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతీ అన్నారు. ఈరోజు ఐద్వా కెవిపియస్ dyfi ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం చేయడo జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు వెలుగులో కొచ్చాయనీ ఈ ఘటనలో ఆ మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పది ఆ మహిళల కుటుంబ సభ్యులను హత్యలు చేసినట్లుగా కూడా వార్తలొస్తున్నాయ ఈ దుర్మార్గమైన ఘటన తీవ్ర నిరసన, ఆగ్రహం వెల్లువెత్తకుండా ఆ గుంపులో ఒకరిని, సాయంత్రానికి మరో ముగ్గురిని అరెస్టు చేశారని ఇప్పటిదాకా నోరెత్తని ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు తాము తీవ్రంగా బాధపడుతున్నా మంటూ మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారనీ ఆమె అన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారని . రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిగ్గు లేకుండా ఇలాగే వుంటే. ఈ ఘటనను సు మోటోగా తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించిందని దేశంలో పరిస్థితి ఎంత దిగజారింది అవగతమవుతుంది అన్నారు. ఆదివాసీ మహిళగా ఉన్న రాష్ట్రపతి గారు మాత్రం ఏమి స్పందించలేదని ఆవేదనా వ్యక్తం చేశారు
మణిపూర్ లో ఎంతోమంది మహిళలు అత్యాచారాలకు, వేధింపులకు గురవుతూనే వున్నారని ఇల్లు, ఆస్తుల్ని కోల్పోయారని . దారుణమైన హింసను అనుభవిస్తున్నారని అన్నారు.
మహిళలకు రక్షణగా ఏ చట్టాలూ, న్యాయాలూ నిలబడడం లేదని ప్రజలంతా తమ హక్కుల రక్షణ కోసం ముందుకు రాకతప్పదని అన్నారు.
కాంగ్‌ఫోక్సీలో మహిళలపై అమానుష కాండకు కారకులైన నేరస్తులందరినీ తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున. సహాయ కార్యదర్శి గాదె నరసింహ బొల్లు రవీందర్ తక్కెళ్ళపల్లి శ్యామ్ ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల పద్మ భూతం అరుణకుమారి మంజుల ప్రజాసంఘాల నాయకులు బండ శ్రీశైలం పుచ్చకాయల నర్సిరెడ్డి కొండ వెంకన్న సైదులు నలపరాజు కిరణ్ మంజుల మమత పద్మ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment