తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విముక్తి సంఘం వ్యవస్థాపకుడు అర్థం శ్రీనివాస్ పై దాడి
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విముక్తి సంఘం వ్యవస్థాపకుడు అర్థం శ్రీనివాస్ పై దాడి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరపాలని, ప్రస్తుతము అధ్యక్షుడు గా చెప్పుకుంటున్న అమరవాది వై తొలిగి సక్రమంగా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా లో మాటలు, పాటలు వైరల్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విముక్తి సంఘం వ్యవస్థాపకుడు అర్థం శ్రీనివాస్ పై సోమవారం రాత్రి దాడి జరిగింది. శ్రీనివాస్ చేస్తున్న విమర్శలను తట్టుకోలేక నల్గొండ ఆర్యవైశ్య మహాసభ నాయకుడు అర్థం శ్రీనివాస్ పై దాడి చేసి చంపుతా అని బెదిరించి నట్లు అర్థం శ్రీనివాస్ సోషల్ మీడియాలో తన వాయిస్ పోస్ట్ చేశాడు. అందులో నేను బీద వైశ్యుల కు న్యాయం చేయాలని కోరుకుంటే నా పై దాడి చేస్తారా, ఏది న్యాయం కాదని ఆయన అన్నారు. అమరవాది గ్రూప్ తో తన కు ప్రాణ హాని ఉన్నదని అన్నారు. తన పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దాడిలో తన పెదవి పై గాయం అయినట్లు అయన అన్నారు. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే మాటల వరకే ఉందాలి, కలసి కూర్చొని మాట్లాడుకోవాలి. అలా కాకుండా దాడి చేయడం ఎంతవరకు సబబని ఆర్యవైశ్య ప్రజలు అంటున్నారు. ఈ దాడి కి రాష్ట్ర నాయకత్వమే భాధ్యత వహించ వలసి ఉంటుందని కొందరు వైశ్యుల అంటున్నారు. ఈ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్ట పరంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ కు ఎన్నికలు పెట్టి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడాలని వైశ్యుల కోరిక.
ఈ క్రింది లింక్ ను టచ్ చేసి అర్థం శ్రీనివాస్ వాయిస్ వినవచ్చు.
Comments
Post a Comment