ఐవియఫ్ దశాబ్ది ఉత్సవాలు
ఐవియఫ్ దశాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్: ఐవియఫ్ స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రేపు అనగా 9.7.2023 ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నాగోల్ లోని యస్.వి.యఎం.గ్రాండ్ (ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన) నందు ఐవియఫ్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా జాతీయ అధ్యక్షలు అశోక్ అగర్వాల్, జాతీయ సీనియర్ కార్యనిర్వహక అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త గార్లు పాల్గొంటారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ ప్రమాణ స్వీకారం, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం, హైదరాబాద్ నగరం లోని పలు డివిజన్ ల మహిళ కార్యవర్గ స్వీకారాలు, జిల్లాల అత్యుత్తమ అధ్యక్షులకు అవార్డుల బహుకరణ ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల నుండి రాష్ట్ర IVF మిత్రులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని అయన కోరారు.
Comments
Post a Comment