IFWJ జాతీయ కార్యదర్శి గా భరత్ కుమార్ శర్మ నియామకం
IFWJ జాతీయ కార్యదర్శి గా భరత్ కుమార్ శర్మ నియామకం
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 132 వ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మరో పదవి లభించింది. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ ప్రతిపాదనల మేరకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పాండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణకు చెందిన భరత్ కుమార్ శర్మకు ఐఎఫ్డబ్ల్యూజే IFWJ జాతీయ కార్యదర్శి గా అవకాశం కల్పించారు. నేటి నుంచి ఆ పదవి కొనసాగుతుందని జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పాండేజీ తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ TJU ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొనసాగుతున్న భరత్ కుమార్ శర్మను జాతీయ నాయకత్వం గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు సారధ్యంలో IFWJ జాతీయ కార్యదర్శి గా నియమించిన ఆయనను సన్మానించారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు మరియు బృందానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ ఉన్నారు ఇంత పెద్ద పదవిని తెలంగాణకు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్యకు ఇంత కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు గారికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు
Comments
Post a Comment