జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు
జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు కేసిఆర్ ప్రభుత్వం చెప్పేది ఒక్కటి చేసేది మరొక్కటి సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీ అందరి జర్నలిస్ట్ లకు ఆరోగ్యం విద్య నివాసం మా లక్ష్యం సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటుచేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులు డా అనీల్ కుమార్ డా శంకర్ డా శివశంకర్ పంపిణీ చేశారు జర్నలిస్టుల కుటుంబీకులకు ఇందులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు . సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయడం సమాజానికి చేసిన సేవే అని ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన పలువురు నాయకులు ప్రభుత్వం జర...