అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన
అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన
వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ
హైదరాబాద్, (గూడచారి ప్రతినిధి) : తెలంగాణలో తక్షణం వైశ్యకమిషన్‌ను ఏర్పాటు చేయాలని వైశ్య వికాస వేదిక ప్రభుత్వాన్ని కోరింది. వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకోసం వైశ్య వికాస వేదిక చైర్మన్ డా.కాచంసత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన నిర్వహించనున్నట్లు వైశ్య వికాస వేదిక చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లను విన్నవించారు. ముఖ్యంగా ewsలో వర్గీకరణ తేవాలని వైశ్యకార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీవిద్య సహాయనిధిని ఏర్పాటుచేసి వైశ్య విద్యార్థులకు తోడ్పాటు అందించాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయాలలో వాటా కల్పించాలని వైశ్యబంధు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబసర్వే నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు, జనసంఖ్య, గణాంకాలు ప్రకటించాలని కోరారు.
Comments
Post a Comment