*జాగో వైశ్య జాగో లేవండి..* ఈ నెల 12న హనుమకొండ లో చర్చా గోష్టి

*జాగో వైశ్య జాగో లేవండి..* ఈ నెల 12న హనుమకొండ లో చర్చా గోష్టి

హనుమకొండ (గూడచారి న్యూస్) : తెలంగాణా లో వైశ్యులకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి పిలుపు నిస్తూ ఈ నెల 12న హనుమకొండ లోని అవోపా భవన్ లో వరంగల్ హనుమకొండ జిల్లా వైశ్యులు చర్చా గోష్టి నిర్వహిస్తున్నారు.

లొకేషన్ లింక్

https://maps.app.goo.gl/k4jch7kLufRxNYTp7?g_st=iw


వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్, తెలంగాణ సాధన ఉద్యమకారుడు డా|| కాచం సత్యనారాయణ* గారి ఆధ్వర్యంలో వైశ్యుల అన్ని రకాల సమస్యల పరిస్కారానికి *వైశ్య కమీషన్ ఏర్పాటు* *వైశ్యుల ఆర్థికాభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు* *EWS అమలులో వర్గీకరణ,జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యం* *వైశ్య విద్యార్థుల ఉన్నత విద్యల కోసం విదేశీ విద్యా నిధి ఏర్పాటు* *వైశ్య బంధు అమలు* *వైశ్య జనాభా గణన వారి స్థితిగతుల పై సర్వే* తదితర అంశాలపై పోరాటం చేసేందుకు తొలిసారిగా హైదరాబాద్ లో *వైశ్యుల ఆత్మ గౌరవం - హక్కుల సాధన* అనే నినాదంతో చర్చా ఘోష్టి మేధోమధనం నిర్వహించి, దీనిని విస్తృతం చేయడానికి జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయికి తీసుకుపోవాలని నిర్ణంచారని వారు తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశాన్ని ఈ నెల 12న హనుమకొండ లోని అవోపా భవన్ లో వరంగల్ హనుమకొండ జిల్లా లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వైశ్య పాత్రికేయులు, న్యాయ వాదులు, ఉపాధ్యాయులు,డాక్టర్లు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అమూల్య సలహాలు, సూచనలు అందజేయడం ద్వారా పటిష్టమైన పోరాటం నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. సమావేశ అనంతరం భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్