*ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఈనెల 14న సూర్యాపేటలో బైక్ ర్యాలీ*
*ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో
ఈనెల 14న సూర్యాపేటలో బైక్ ర్యాలీ*
*ఆర్యవైశ్యులంతా కదిలి రావాలి*
ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దిశగా ఆర్యవైశ్యులందరూ ఏకం కావాలని జిల్లా ఆర్యవైశ్య సంఘo మాజీ అధ్యక్షులు కర్నాటి కిషన్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల లో ఉన్న పేదలు ఆర్థికంగా స్థిరపడాలంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారానే అది సాధ్యమన్నారు. పార్టీల కతీతంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా సైనికుల వలె పని చేయాలన్నారు. ఈనెల 14న జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి బైకు ర్యాలీ నిర్వహిస్తున్నందున ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయంగా మనకు రావలసిన వాటాను పొందే దిశగా సంఘటితమై మన సత్తా చాటాలన్నారు. కే సి గుప్తా విగ్రహానికి నివాళులు అర్పించి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా నుండి ఎంజీ రోడ్డు లోని గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు , బొమ్మిడి లక్ష్మినారాయణ, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్,మంచాల రంగయ్య, కుక్క డపు శ్రీనివాస్, గుండా రమేష్, కక్కిరెని వెంకటేశ్వర్లు, తల్లాడ వెంకటేశ్వర్లు, గుడుగుంట్ల విద్యాసాగర్, నూనె యుగంధర్, సంతోష్, పసుపర్తి కృష్ణమూర్తి, కందగట్ల సురేష్, కక్కిరేణి ప్రభాకర్,మహంకాళి సోమయ్య, అంజన్ ప్రసాద్, కొండ్ల రంగయ్య, శ్రీరంగం వెంకటేశ్వర్లు, మిర్యాల రామ్మూర్తి,మిరియాల శివకుమార్, తోట లచ్చయ్య, బచ్చు పురుషోత్తం,హరి, కొండ్లే కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment