15న నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్
ఈ నెల 15న నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్
నల్గొండ, ఆగస్టు 11, (గూడచారి ప్రతినిధి) నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 15న స్థానిక చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జర్గుతున్నదని ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా చైర్మన్, తెలంగాణ శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గార్లు పాల్గొంటారని, అయన తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడుగా రేపాల భద్రాద్రి, ప్రధాన కార్యదర్శి గా నూనె కిషోర్, కోశాధికారి గా గోవిందు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గా తేలుకుంట్ల శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శివగా గౌరు శ్రీనాథ్, జిల్లా కోశాధికారి గా మిర్యాల మహేష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలుగా కొమిరిశెట్టి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వందనపు జ్యోతి, జిల్లా కోశాధికారిగా వనమా శ్రీదేవి గార్లు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.
Comments
Post a Comment