బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా కార్యదర్శిగా ఆదిమల్ల దేవేందర్
బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా కార్యదర్శిగా ఆదిమల్ల దేవేందర్ నియామకం
నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలంలోని
తుర్కపల్లి గ్రామానికి చెందిన *ఆదిమల్ల దేవేందర్
ను జిల్లా ఎస్సీమోర్చా కార్యదర్శిగా నియామకం చేస్తూ మంగళవారం బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాన్ని దేవేందర్కు అందచేశారు. ఈ సందర్బంగా గోలి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పధకాలలో ఎస్సీలను లబ్ధిదారులుగా చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు. దేవేందర్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన గోలి ప్రభాకర్ కి,
నియామాకానికి సహకరించిన ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యదర్శి పొతేపాక సాంబయ్య కి వెన్నమళ్ళ మహేష్ కొత్తపల్లి ప్రమోద్ కి కృతజ్ఞతలు తెలియచేసారు.
Comments
Post a Comment