సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తుంది
సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తుంది
ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నల్లగొండ దొడ్డి కొమురయ్య భవన్లో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ* మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తూ నాటి చదువు వెలుగు సాక్షరతా ఉద్యమం మొదలుకొని నేటి మూఢనమ్మకాలు నీరు పారిశుధ్యం ఎయిడ్స్ అనేక రకాల కళారూపాలు పాటలన్నీ తయారుచేసి ప్రజల చైతన్యం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాల వ్యాప్తంగా 5000 మంది కళాకారులకు శిక్షణ శిబిరాలు పెట్టి కళాకారుల తయారుచేసిందని ప్రజానాట్యమండలి కళకళ కోసం కాదు కల ప్రజల కోసం ప్రజల చైతన్యం కోసమని ఆయన అన్నారు పల్లె సుద్దులు ఒగ్గు కథ డోలు డప్పు వివిధ కళారూపాలు తయారు చేసింది ఒక సంస్కృతిక ఉద్యమాన్ని నడిపింది ప్రజానాట్యమండలి కొని ఆడారు ఆ సందర్భంలోనే ప్రజానాట్యమండలి 80 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబోతున్నట్టు దానికి కళాకారులు కళాభిమానులు మేధావులు ప్రజలు రైతులు కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు *కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున* మాట్లాడుతూ రేపు స్వాతంత్రోద్యమ అమరుల యాదిలో ప్రజానాట్యమండలి ఆగస్టు 15న జెండాల దగ్గర సంస్కృతిక కార్యక్రమాలు పాట లు సాగుతుందని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు *ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ కార్యదర్శి వర్గ సభ్యులు ఆమనగంటి ఐలయ్య వరికుప్పల ముత్యాలు పల్లె ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులు మేడి అంజమ్మ దుబ్బగిరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు*
Comments
Post a Comment