త్వరలో వైశ్య గర్జన - *హక్కుల సాధనే ఆత్మగౌరవ మార్గం*


 త్వరలో వైశ్య గర్జన - *హక్కుల సాధనే ఆత్మగౌరవ మార్గం* 


నల్లగొండ: వైశ్యుల్లో చైతన్యం పెంపొందించడానికి :వైశ్యులు- ఆత్మగౌరవం.: హక్కుల సాధన" పై నల్గొండ జిల్లా కేంద్రంలో చర్చ గోష్టి నిర్వహించారు. ఈ చర్చ గోష్టి లో పాల్గొన్న పలువురు వైశ్య అడ్వకేట్లు, టీచర్లు, మీడియా పర్సన్స్, వ్యాపారులు వైశ్యులు తమ హక్కులు సాధించుకొని ఆత్మగౌరవంతో తలెత్తుకొని మనుగడ సాగించాలంటే రాజ్యాధికారంలో తమ వంతు వాటా సాధించుకోవడం ఒక్కటే మార్గం అని అన్నారు. త్వరలో వైశ్య గర్జన నిర్వహించనున్నమని తెలిపారు. హైదరాబాదులో వైశ్య విద్యావంతులు మేధావుల తో జరిపిన చర్చలు, మేధో మధనాల ఫలితంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఉద్యమాల జిల్లా నల్లగొండ జిల్లా నుంచే మొదలు పెడుతున్నామని తెలిపారు. వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన పై వైశ్య వికాస వేదిక ప్రచురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 

బిజెపి సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు, వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ, గార్లపాటి జితేంద్ర కుమార్, సీనియర్ జర్నలిస్టులు కోటగిరి దైవాదీనం తదితరులు పాల్గొన్నారు.




















Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్