*ఎస్సీ, ఎస్టీ, గౌడ్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్ లు కేటాయింపు*
*ఎస్సీ, ఎస్టీ, గౌడ్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్ లు కేటాయింపు*
నల్గొండ:
2023–25 సంవత్సరాలకు రెండేళ్ల కాల పరిమితికిగాను జిల్లాలో మొత్తం 155 మద్యం దుకాణాలకు గాను ఎస్.టి.,ఎస్.సి.,గౌడ్ సామాజిక వర్గాలకు నూతన మద్యం పాలసీ ననుసరించి వారికి రిజర్వేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయించారు. గురు వారం ( ఆగస్ట్ 3) న జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్ తో కలిసి కమిటీ సభ్యులు ఎక్సైజ్,ప్రోహిబిషన్ సూపరిండెంట్ బి.సంతోష్, ఎస్.సి.అభివృద్ధి అధికారి ఎల్.శ్రీనివాస్,బి.సి.అభివృద్ధి సంక్షేమ అధికారి ఖాజా నాజిం అలీ,గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ అధికారుల సమక్షంలో ఎస్.సి.,ఎస్.టి.,గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ 'ప్రాతిపదికన మద్యం దుకాణాలు, నిర్ధారించేందుకు డ్రా నిర్వహించి మొత్తం 155 ఏ4 మద్యం షాపుల్లో గౌడ్ లకు 34, ఎస్సీ లకు 14, ఎస్టీ లకు 4 షాపులు మొత్తం 52 షాపు లను రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు.
మిగిలిన 103 మద్యం షాపులను జనరల్ స్థానాలుగా కేటాయించారు. ఈ కార్యక్రమం లో ఆసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ చాణక్య తదితరులు ఉన్నారు.
జిల్లా ప్రోహిబిషన్,ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.సంతోష్ మాట్లాడుతూ
ఈ నెల 4న మద్యం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, పని దినాల్లో టెండర్ దరఖాస్తులను తీసుకుంటారని, ఈనెల 4 నుండి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం టెండర్ దరఖాస్తును అందజేయాలని తెలిపారు. ఈనెల 21న డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. టెండర్ లభించినవారు 21, 22 తేదీల్లో మొదటి దశ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 30న టెండర్ పొందినవారికి మద్యం సరఫరా చేస్తారు. డిసెంబర్ 1న నూతన మధ్యం షాపు లు ప్రారంభించాల్సి ఉంటుంది.
Comments
Post a Comment