వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది? - బల్లు చంద్రప్రకాష్ గుప్త






వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?,
రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది? - బల్లు చంద్రప్రకాష్ గుప్త
సోషల్ మీడియా పోస్ట్ యదావిదంగా

వైశ్య సోదరులందరికీ విజ్ఞప్తి
******************

తెలంగాణలోని యావత్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా వైశ్య కార్పొరేషన్...రాజకీయ అభివృద్ధి పై గమనించాల్సిన సమయం ఆసన్నమైనది. అసలు తెలంగాణ రాష్ట్రంలో వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, అన్న అంశంపై నిరుపేద వైశ్య సమాజం సర్వత్ర ఆసక్తి కనబరుస్తున్నారు. "ఎవరికి వారే యమునా తీరే" అన్న చందంగా వైశ్య కార్పొరేషన్ విషయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైశ్య కార్పొరేషన్ సాధించాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రస్థాయి సంస్థలు అనేక విధాల, రకరకాల కార్యాచరణ కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్న విషయం విధితమే... ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్ అధ్యక్షులుగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆవిర్భవించిందని ఇటీవల ప్రకటించారు.
అయితే ఈ (జేఏసీ)లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఆవోపా, వాసవి క్లబ్, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వైశ్య వికాస వేదిక, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక, అంతర్జాతీయ 
వాసవి మహిళా సమాఖ్య, మహిళా సంఘాలు రాష్ట్ర యువజన సంఘాలు రాష్ట్ర స్థాయి ఇతర సేవా సంస్థలు ఉన్నాయా....?, మరి ఇటువంటి రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది ..?
రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా కేంద్రంలో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కాచం సత్యనారాయణ సారద్యంలో జరిగిన కార్యక్రమం దేనికి సంకేతం...?
వైశ్య కార్పొరేషన్ సాధనకై తెలంగాణ రాష్ట్రంలోని అనేక సంస్థలను కలుపుకొని ముందుకు సాగితే తప్ప ఎటువంటి అభివృద్ధి.. జరగదన్న విషయాన్ని నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎవరికి వారే అన్న చందంగా వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్న వాస్తవాన్ని గుర్తించాలి... ఎవరికి వారే జాయింట్ యాక్షన్ కమిటీల పేరుతో జేఏసీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వ దృష్టిలో చులకన కావడం ఖాయం అన్న విషయాన్ని నాయకులు గుర్తించాలి. అందరూ సమిష్టిగా ముందుకు సాగితేనే వైశ్య కార్పొరేషన్, వైశ్య కమిషన్ తోపాటు ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించి ముందుకు సాగితే వైశ్య జాతికి మంచిది....

Bcpguptha 
98491 81448

 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్