వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్.సిబ్బంది కలిసి సమన్వయంతో పని చేయాలి - జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్


వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్.సిబ్బంది కలిసి సమన్వయంతో పని చేయాలి - జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్

*డెంగ్యూ,సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కు చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్*

# వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ లు, ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.లు సూపర్ వైజర్ లతో సమీక్షించిన కలెక్టర్#

నల్గొండ,

dt 4.8.23

వైద్య ఆరోగ్య శాఖ, ఐ .సి.డి.ఎస్.సిబ్బంది సి.డి.పి. ఓ.లు,సూపర్ వైజర్ లు,అంగన్ వాడి టీచర్ లు,వర్కర్ లు,.హెచ్.సి. డాక్టర్ లు,సిబ్బంది సమన్వయం తో పని చేయాలని అన్నారు. పి.హెచ్.సి.డాక్టర్ లు,సిబ్బంది సమర్త్వంతంగా పనిచేస్తూ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉదయా దిత్య భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ పి.హెచ్.సి డాక్టర్ లు, అంగన్ వాడి సి.డి.పి. ఓ.లు,సూపర్వైజర్ లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డెంగ్యూ కేసులు గురించి తెలుసుకున్నారు.డెంగ్యూ వచ్చిన వెంటనే వారికి చికిత్స అందించడమే కాక డెంగ్యూ కేస్ వచ్చిన ఇంటి పరిసరాల లోని 100 గృహాల వరకు డెంగ్యూ నివారణ,దోమల లార్వా నియంత్రణకు అంటి లార్వా ఆపరేషన్ స్ప్రేయింగ్,ఫాగింగ్,నీటి నిల్వ లేకుండా స్థానిక పంచాయతీ,మున్సిపల్ సిబ్బంది సమన్వయం తో వైద్య ఆరోగ్యశాఖ, ఐ.సి.డి.ఎస్ అంగన్ వాడి సిబ్బంది చర్యలు చేపట్టాలని అన్నారు.పి.హెచ్.సి.లలో హెల్త్ వెల్ నెస్ సెంటర్ లకు సరఫరా చేసిన డెంగ్యూ రాపిడ్ టెస్ట్ కిట్ లు ఉపయోగించాలని,జ్వరం కేసులు వచ్చిన డెంగ్యూ రాపిడ్ టెస్ట్ కిట్ తో రక్త పరీక్ష చేయాలని అన్నారు.ప్రతి వారం రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు

డెంగ్యూ నిర్దారణ అయితే ప్రకటించకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోని టి.హబ్ కి పంపి డెంగ్యూ పాజిటివ్ నిర్దారణ అయితేనే పాజిటివ్ గా ప్రకటించాలని అన్నారు.

ప్రైవేట్ డయాగ్న స్టిక్ సెంటర్ లు కూడా డెంగ్యూ నిర్దారణ అయితే ప్రకటించ వద్దని,టి.హబ్ కు శాంపిల్ పంపించాలని,టి.హబ్ లో నిర్దారణ అయితే ప్రకటించాలని అన్నారు

డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు ప్రత్యేకంగా 24 గంటలు పని చేసేలా ల్యాబ్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డ యాగ్న స్టిక్ సెంటర్ లతో సమావేశం ఏర్పాటు చేసి తెలుపాలని అన్నారు.

సీజనల్ వ్యాధులు టైఫాయిడ్,డయేరియా,వ్యాధుల నివారణకు అవసరమైన మందుల కిట్ అన్ని పి.హెచ్.సి.లలో ఉండాలని అన్నారు.

పి.హెచ్.సి డాక్టర్ కు ఎం.పి.డి. ఓ లతో మండల స్థాయి సమావేశం నిర్వహించి డెంగ్యూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

హెల్త్ వెల్నెస్ సెంటర్ లు ఉన్న పి.హెచ్.సి.లలో ఉన్న ఆయుష్ డాక్టర్ లు పి.హెచ్.సి.డాక్టర్ లతో కలిసి పని చేయాలని,రోగులను ఓ.పి.లో విధులు నిర్వర్తించాలని అన్నారు.

పి.హెచ్.సి.లలో ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ లు, అనీమియా లోపం ఉన్న గర్భిణీలకు తగు చికిత్స అందించాలని అన్నారు

వైద్య ఆరోగ్య సబ్ సెంటర్ లలో అంగన్ వాడి లలో తక్కువ,బరువు ఎత్తు,పోషకాహారం లోపం ఉన్న పిల్లలను పరీక్షించాలని,అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎన్.అర్.సి.సెంటర్ కు పంపించాలని అన్నారు.

ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం దేశం లో ఎక్కడ లేదని,ఆరు నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాల మహిళా,ఉద్యోగులు,మహిళలు ఆరోగ్య పరీక్షలు చేసుకొనే విధంగా ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్ లు, అంగన్ వాడి కార్యకర్త, ఐ.కె.పి.మహిళలు అవగాహన కలిగించాలని అన్నారు.

వైద్య కళాశాల లో రెండు ఆపరేషన్ థియేటర్ కొత్తగా రెండు వర్క్ స్టేషన్ లకు నిధులు మంజూరు చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.వైద్య కళాశాలలో అవసరమైన సదుపాయాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింెండెంట్ ,డి.సి.హెచ్.ఎస్,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లు చర్చించి ప్రతిపాదనలు అంద చేయాలని అన్నారు .వైద్య ఆరోగ్య శాఖ,ఏరియా ఆసుపత్రులు,మెడికల్ కాలేజీ అన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిoటెండెంట్ లచ్చు నాయక్,జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ,వయో వృద్ధుల, దివ్యాం గుల శాఖ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్