అభ్యర్థులను నిర్ణయించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు - తెలంగాణ రాష్ట్ర బిజెపి
అభ్యర్థులను నిర్ణయించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు - తెలంగాణ రాష్ట్ర బిజెపి
-
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించినట్లు మీడియాలో పలు కథనాలు
వస్తున్నాయి. ఈ కథనాలకు ఎలాంటి ఆధారం లేదు. ఈ వార్తలలో నిజం లేదు. అసెంబ్లీ అభ్యర్థుల
ఎంపిక గురించి పార్టీలో ఇంతవరకు ఎలాంటి చర్చా జరగలేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపినట్లు కార్యాలయ కార్యదర్శి డా॥ బి. ఉమాశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారుచేస్తే అధికారికంగానే ప్రకటిస్తుందని, పార్టీ కార్యకర్తలు ఇలాంటి కల్పిత కథనాలపట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిజెపి రాష్ట్ర పార్టీ తెలియజేస్తున్నదని ఆ ప్రకటన తెలిపారు.
Comments
Post a Comment