అస్తమించిన పొడుస్తున్న పొద్దు (గద్దరన్న గుమ్మడి విఠల్ రావు) కు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఘణ నివాలి.


 #అస్తమించిన_పొడుస్తున్న_పొద్దు#


తెలంగాణా ఉద్యమంలో కీలకంగా మారిన పాట పొడుస్తున్న పొద్దు.... పాట పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసి పడేలా చేసినా #ప్రజాయుద్ద_నౌక_గద్దర్# అస్తమించారు.

 తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తిండిపోయే ఆయన పాటకు మరణం లేదు. నిత్యం పాటల తూటాతో ప్రజలను చైతన్య పరుస్తూ ఆఖరి నిమిషం వరకు ప్రజల కోరకు ప్రభుత్వము పై పోరాటం చేసి అస్తమించిన పొడుస్తున్న పొద్దు (గద్దరన్న గుమ్మడి విఠల్ రావు) కు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఘణ నివాలి. 


 గద్దరన్న జీవితం మొత్తం ముళ్ళ బాటే


గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ లో జన్మించిన ఆయన ఉన్నత విద్య అభ్యసించిన ఆయన నక్సలిజానికి ప్రభావితం అయి నక్సలైట్ ఉద్యమంలో చేరి చురుకుగా పనిచేశారు.

 పోలీసుల అరెస్ట్ తర్వాత ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో గద్దర్ పై కాల్పులు జరిగాయి అయిన బ్రతికి బయట పడ్డ గద్దర్ తనపై కాల్పులు జరిపినా దుండగులను అరెస్టు చేయాలంటూ న్యాయ పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అనేక మార్లు కాల్పులు జరిపిన వారిని శిక్షించాలంటూ ఆఖరి నిమిషం వరకు న్యాయం చేయాలంటూ విన్నవించారు.23 ఏళ్లుగా పోరాటంచేస్తున్నా నిందితులను పోలీసులు పట్టు కొలే చేస్తూ అనారోగ్యం కారణంగా మరణించారు.


తెలంగాణ కోసం అనేక ప్రజా ఉద్యమాలు చేసినా ఆయనకు కేసిఆర్ ప్రభుత్వము ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.

రాజకీయ క్లారిటీ లెని గద్దర్ కాంగ్రెస్, ప్రజా శాంతి పార్టీలలో చేరిన లాభం లేదు ప్రధాని నరేంద్ర మోడీ మాటలు వింటా అనీ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆయన పై మీడియా లో హాట్ టాపిక్ అయ్యారు. 

ఉద్యమం ద్వారా మంచి చేశారని కొందరు తమ పిల్లలను నక్సలైట్ ఉద్యమం మార్చి గద్దర్ పిల్లలను అమెరికాలో మంచి జీవితాన్ని ఇచ్చారంటు అనేక మంది విమర్చించే వారు ఉన్నారు


తెలంగాణా ఉద్యమం వైపు లక్షలు మందిని తన పాటల ద్వారా భువన గిరీ, నల్గొండ, మెదక్ జిల్లాల్లో సభలు నిర్వహించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు.

 ప్రజలను చైతన్య పరుస్తూ నిత్య విద్యార్థిలా పోరాటాలు చేశారు.


ప్రజా యుద్ధ నౌక మూగబోయింది.. ఉద్యమ గళం ఊపిరి ఆగింది.. గద్దరన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిశారు!. ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరన్న వార్త విన్న తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 


ప్రజలు కోరుకున్నప్పుడు నేను పోటి చెయ్యిలే నేను పోటి చేస్తా అన్నప్పుడు ప్రజలు తనతో లేరుఅంటూ బావొద్యద్వెగంగా కన్నీళ్లు పెట్టిన గద్దర్ 


తెలంగణ జర్నలిస్ట్స్ యూనియన్ సోమాజి గూడ లో ఏర్పాటు చేసినా 10 ఏళ్ళ తెలంగణ లో

 దగపడ్డది ఎవరు ?

దండు కున్నది ఎవరు? 

కర్యకమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అమరుల తల్లుల కడుపుకోత కు గురైన తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎలాంటి న్యాయం చెయ్యలేదని కన్నీళ్లు పెట్టు కొని తెలంగాన ప్రజలను క్షమాపణ చెప్పారు. కేసిఆర్ తెలంగాణా మోసం చేశారని ఆయనను ఒడించాలని గజ్వేల్ లో తాను పోటీ చేస్తా అన్నారు. 


అదె నెలలో ఆలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సన్మానం చేస్తున్న సందర్భంలో అమరవీరలకు క్షమపన చెప్పి కన్నీళ్లు పెట్టు కున్నారు

తెలంగాన తెచ్చి చేసినా మంచిలేదన్నారు

కొన్ని రోజుల్లో అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు గుండె సంబంచిన ఆపరేషన్ చేసినా కోలుకున్నారని అనుకున్న సమయానికి మరణించారు .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్