ఎంటెక్ పట్టా పొందిన కప్పర సంస్కృతి
ఎంటెక్ పట్టా పొందిన కప్పర సంస్కృతి
హైదరాబాద్:
మహేంద్ర యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థుల పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంటెక్ పట్టా స్వీకరించిన కప్పర సంస్కృతి. విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే అన్నిటికంటే ముందు ఇగో ను వదిలి పెట్టాలని జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు ఉద్భోదించారు. మహేంద్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎంటెక్ విద్యార్థులు పట్టా ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యి
ప్రసంగించారు. ఎంటెక్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని
విద్యార్థులకు ఆయన పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీల అధిపతి, మహేంద్ర యూనివర్సిటీఛాన్స్ లర్ ఆనంద్ మహేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో
ప్రతిభ చూపి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకురావాలని
సూచించారు. ఎంటెక్ లో ప్రతిభ కనబరిచిన కప్పర సంస్కృతికి ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.
Comments
Post a Comment