జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు


 

జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు


కేసిఆర్ ప్రభుత్వం చెప్పేది ఒక్కటి చేసేది మరొక్కటి


సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 

హెల్త్ కార్డుల పంపిణీ

అందరి జర్నలిస్ట్ లకు ఆరోగ్యం విద్య నివాసం మా లక్ష్యం


సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటుచేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులు డా అనీల్ కుమార్ డా శంకర్ డా శివశంకర్ పంపిణీ చేశారు జర్నలిస్టుల కుటుంబీకులకు ఇందులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు .

సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయడం సమాజానికి చేసిన సేవే అని ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు


తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన పలువురు నాయకులు ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షను కడుతుందని 9 సంవత్సరాలుగా పక్కా గృహాలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయమని ఉచిత విద్య హెల్త్ కార్డులు హామీలకే పరిమితం అయ్యాయన్నారు 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కొన్ని చోట్ల విజయం సాధించిందని అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తే కచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవడం తధ్యం అన్నారు.


హత్నూర మండలం లో సీనియర్ జర్నలిస్టులమంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఒక్కొక్క జర్నలిస్టు మూడుసార్లు ఇండ్ల పట్టాలు తీసుకోవడం జర్నలిస్టు సమాజానికి మంచిది కాదని కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు లేదంటే కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.



తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జర్నలిస్ట్స్ లకు కెసిఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ హక్కులను హరించడం అంత మంచిది కాదన్నారు


జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు హెల్త్ కార్డులు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య హక్కులని వీటిని ప్రభుత్వం ఇవ్వాలని లేదంటే వీటిని ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.


రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోల చేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటం చేస్తామని

గతంలో జర్నలిస్టుల హక్కులు టిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చిన పట్టించుకున్న పాపాన పోలేదని రేపు రాబోయే ప్రభుత్వంలో అలాకాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.


జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు 15 సంవత్సరాలు నిండిన వారికీ పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడ చెవిన పెడతలేదని అన్నారు.


కొన్ని జర్నలిస్టు సంఘాలు ఫేక్ నటన ద్వారా జర్నలిస్టులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వారి నటనను ఒకరు హరీష్ రావుతో సన్నిహితంగా ఉంటే మరొకరు కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటూ జర్నలిస్టులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు.


సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ల పనితీరు ప్రశంసించారు


యూనియన్ బలోపితం చేయాలనే రాష్ట్ర కమిటీ సూచన మేరకు రాష్ట్ర కార్యదర్శిగా మారేపల్లి కృష్ణ (10 టీవీ బ్యూరో ) నియమించారు


 

ఈ కార్యక్రమంలో IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర కార్యదర్శి దశరథ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాబురావు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వల్లపు శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్, మెదక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య , జనగాం జిల్లా అధ్యక్షులు రమేష్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజాంబాద్ జిల్లాల అధ్యక్షులు మహేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు సిద్దాల రవి హత్నూర స్థానిక జర్నలిస్టులు సంగారెడ్డి జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్