వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
తేదీ 29 ఆగస్టు 2023 మంగళవారం నాడు నల్లగొండ పట్టణంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కొరకు ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ తదనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులొ ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు నిజంగా లబ్ధి చేకూరాలని భావించే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు మద్దతు పలికి కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్నికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతుంటే దురదృష్టకరమైన విషయం కొన్ని *వైశ్య సంఘాలు* వ్యతిరేకిస్తున్నాయి అని సమాచారం నిజంగా వైశ్యుల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేసిన సంఘాలు ఏవి కూడా వైశ్య కార్పొరేషన్ కొరకు చేస్తున్న పోరాటాన్ని వ్యతిరేకించరు అలా వ్యతిరేకిస్తున్నారు అంటే వారు *వైశ్య ద్రోహులుగా పరిగణించవచ్చు* . కార్పొరేషన్ పోరాటాలను వ్యతిరేకించే వైశ్య సంఘాలు వారి స్వార్థం కొరకే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సమాజంలో వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు వైశ్యులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న వారే అని అనుకోవాలి. కాబట్టి అలాంటి వారి ప్రకటనలను ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇప్పటికే సమాజంలో వైశ్యులలో ఐక్యత లేదు అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ఐక్యత లేదు అనేది నిజం కాదు అని సమాజానికి, ప్రభుత్వానికి తెలిసే విధంగా ఐక్యతగా పోరాటం చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి కార్పొరేషన్ సాధన కొరకు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పేద వైశ్యులకు లాభం చేకూరాలి అని భావించే ప్రతి ఒక్క వైశ్యుడు సమర్థించాలి, సమర్థిస్తారు కూడా కాబట్టి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించే వారిని వైశ్యులుగా చూడకుండా *వైశ్య ద్రోహులుగా* పరిగణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలదు అని కోరుచున్నాము.
Comments
Post a Comment