వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు
వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు
నల్గొండ: నల్గొండ వాసవి భవన్ నుండి కార్పొరేషన్ డిమాండ్ తో బైక్ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జున్, కోశాధికారి ఎల్వి కుమార్ మాట్లాడుతూ వైశ్యుల కొరకు 7 డిమాండ్లతో అక్టోబర్ 1న వైశ్య వికాస వేదిక అధ్వర్యంలో నిర్వహిస్తున్న వైశ్య గర్జన మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. మద్దతు ప్రకటించిన IVF & WAM లకు వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కార్పోరేషన్ కోరుతూ ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య అధ్వర్యంలో నేహృగంజ్, క్లాక్ టవర్, ప్రకాశం బజార్, మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ లో జిల్లా కలక్టర్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు యమా మురళి, వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, నల్గొండ పార్లమెంట్ కు గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్, IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జున్, కోశాధికారి ఎల్వి కుమార్, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కోటగిరి చంద్రశేకర్, సీనియర్ జర్నలిస్టు కోటగిరి రామకృష్ణ, వామ్ జిల్లా అధ్యక్షుడు వందనపు వేణు, అర్థం శ్రీనివాస్, వనమా మనోహర్, బుక్కా ఈశ్వరయ్య, కాసమ్ శేకర్, బండారు వెంకటేశ్వర్లు, నల్గొండ అశోక్, గుబ్భా శ్రీనివాస్, వనమా రమేష్, నీలా వెంకన్న, ఓంప్రసాద్, నూనె కిషోర్, గోవిందు బాలరాజు, తేలుకుంట్ల శ్రీనివాస్, దారం కృష్ణ, పోలా జనార్దన్, కోటగిరి రాంబాబు, గోవర్ధన్, జర్నలిస్టు శ్రీనివాస్, నాంపల్లి భాగ్య, దీప్తి తదితర లు పాల్గొన్నారు.
Comments
Post a Comment