ఆర్యవైశ్యుల హక్కులు సాధనకై వైశ్య గర్జన - కాచం


 

ఆర్యవైశ్యుల హక్కులు సాధనకై వైశ్య గర్జన - కాచం









పాల్వంచ : ఆర్యవైశ్యుల కార్పొరేషన్, ఆర్యవైశ్యుల
హక్కులు ఆర్యవైశ్యుల కు రాజకీయాల్లో వాటా కొరకు  వైశ్యగర్జన హైదరాబాద్ లో ఏర్పాటు  చేసినట్లు వైశ్య వికాస వేదిక పౌండర్ చైర్మన్ కాసం సత్యనారాయణ గుప్తా తెలిపారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వైశ్య  గర్జన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం లో  కాచం సత్యనారాయణ మాట్లాడుతూ అధిక సంఖ్యలో పాల్గొని వైశ్య గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి అన్ని మండలాల ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ మండల
నాయకులు, సభ్యులు పాల్గొన్న వారు మాట్లాడుతూ  వైశ్య గర్జనకు వేలాదిగా తరలివచ్చి మన సమస్యలన్నీ
మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన న్యాయమైన డిమాండ్లుసాధించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, పాల్వంచ ఆర్యవైశ్య మహాసభ టౌన్ అధ్యక్షులు
చలవాది ప్రకాష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత
కోసం అందరూ కట్టుబడి ఉండాలని ఈ వైశ్య
గర్జన సదస్సుని హైదరాబాదులో విజయవంతం
చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో
ఆర్యవైశ్య గర్జన పోస్టర్ రిలీజ్ చేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య గర్జన నిర్వాహకులు కొదమూరి దయాకర్, ములకలపల్లి మండలం ఆర్యవైశ్య నాయకులు బిక్కుమళ్ళ సుధాకర్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు నాళ్ళ మనోహర్రావు, మహిపతి రామలింగం, ధారా మల్లికార్జునరావు, పల్లపోతు సాయిబాబా, ఇల్లందు ఆర్యవైశ్య మండల అధ్యక్షులు మాయా కృష్ణ, ఉమాశంకర్, ఆర్యవైశ్య నాయకులు భాను ప్రకాష్, కొప్పరపు రాము, ఉప్పల వెంకటేశ్వర్లు,బచ్చు శ్రీనివాస్, డోగిపర్తి సతీష్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షురాలు పెండ్యాల రోజులక్ష్మి.
బచ్చు రామ్ కుమార్ కొండ్ల శ్రీనివాస్, పాల్వంచమండల ఆర్యవైశ్యఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు శమంతకమణి, సెక్రటరీ ఇందిర, మౌనిక, నీరజ, తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్