బిజేపి మేనిఫెస్టో -ప్రచార కమిటీ సభ్యునిగా కప్పర ప్రసాద్ రావు నియామకం


 బిజేపి మేనిఫెస్టో -ప్రచార కమిటీ సభ్యునిగా కప్పర ప్రసాద్ రావు నియామకం



గజ్వేల్ నియోజవర్గం 

తిగుల్ గ్రామానికి చెందిన కపర ప్రసాద్ రావు గత 30 సంవత్సరాలు నుండి బిజెపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు బిజెపి మేనిఫెస్టో -ప్రచార కమిటీ కన్వీనర్ గా మాజీ ఎంపీ వెంకటస్వామి ఉన్న కమిటీలో సభ్యునిగా అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో ప్రచార కమిటీ సభ్యునిగా అవకాశం ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సమస్యలతో పాటు జనానికి కావలసిన అభివృద్ధి పనులను మేనిఫెస్టోలో చేర్చేందుకు మంచి అవకాశం అన్నారు. జర్నలిస్టుగా తనకున్న 30 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం మేనిఫెస్టోను అన్ని పార్టీలకు భిన్నంగా బిజెపి పార్టీ విడుదల చేయబోతుందని బిజెపి పార్టీ అంటేనే పేదల పార్టీ అని నరేంద్ర మోడీ అంటేనే పేదల నాయకుడు అని ఆయన సారాధ్యంలో పనిచేస్తున్న బిజెపి ప్రతి కార్యకర్త దేశ రక్షణ ధ్యేయంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తామని దేశం బాగుంటే మనం బాగుంటాము అని నమ్ముతూ ప్రజల సేవ కొరకై నిరంతరం బిజెపి పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికలు దేశద్రోహులకు దేశభక్తులకు మధ్య ఉండబోతున్నాయని ప్రజలు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బిజెపి పార్టీకి అవకాశం కల్పించి ప్రజల సంక్షేమం పొందాలన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఎన్నుకుంటే దేశ విచ్చిందానికి ప్రజలను నట్టేట ముంచి మేనిఫెస్టోను తుంగలో తొక్కి అబద్దాలతో కాలం గడుపుతారన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్